ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: సింహం వర్సెస్ పులి.. ఏది పవర్‌ఫుల్! ఈ వీడియోతో క్లారిటీ!

ABN, Publish Date - Jul 08 , 2024 | 09:08 PM

సింహం, పులి.. ఈ రెండింట్లో ఏది అత్యంత శక్తిమంతమైనది?.. ఎంతోకాలంగా జంతు ప్రేమికుల్ని వేధిస్తున్న ప్రశ్న ఇది. దీనికి ఎవరి సమాధానాలు వారివి. దీంతో, చర్చ కొనసాగుతూనే ఉంటుంది. అయితే, ఈ ప్రశ్నకు తాజా వీడియో సమాధానం చెప్పేసిందని నెటిజన్లు చెబుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: సింహం, పులి.. ఈ రెండింట్లో ఏది అత్యంత శక్తిమంతమైనది?.. ఎంతోకాలంగా జంతు ప్రేమికుల్ని వేధిస్తున్న ప్రశ్న ఇది. దీనికి ఎవరి సమాధానాలు వారివి. దీంతో, చర్చ కొనసాగుతూనే ఉంటుంది. అయితే, ఈ ప్రశ్నకు తాజా వీడియో (Viral) సమాధానం చెప్పేసిందని నెటిజన్లు చెబుతున్నారు.

Viral: సమంత తరువాత మరో ప్రముఖ వ్యక్తిని టార్గెట్ చేసుకున్న ‘ది లివర్ డాక్’!

సింహం, పులి రెండూ భిన్న లక్షణాలు కలిగి ఉంటాయని విషయం తెలిసిందే. మైదాన ప్రాంతాల్లో ఉండే సింహాలు గుంపులుగా వేటాడతాయి. చాలా దూరాలు వెంబడించి జీవాల్ని చంపుతాయి. దట్టమైన అడవులు, కొండ ప్రాంతాల్లో నివసించే పులులకు మాటు వేసి మట్టు పెట్టడం అలవాటు. చివరి నిమిషంలో ఒక్కసారిగా దూకి పీకపట్టి కొరికి చంపేస్తాయి. సింహంలో దూకుడెక్కువ అయితే పులుల్లో శారీరక దారుఢ్యం అధికం. అందుకే పులి, సింహం మధ్య గొడవలో విజయం ఎవరిదనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి (Lion vs tiger fight winner debate settled by this video once and for all).


ఇక తాజాగా వీడియోలో సింహం, పులి తలపడ్డాయి. సింహం తన సహజ రీతిలో దూకుడుగా దాడి చేస్తే పులి మాత్రం ఒక్క పంజా విసిరి సింహాన్ని మట్టికరిపించింది. సింహం తనకు సాటి రాలేదన్నట్టు ఉంది దాని బలం. అయితే, నేరుగా తలపడటం పులికి సహజంగా ఇష్టం ఉండదు కాబట్టి ఈ ఫైట్‌లో కొన్ని సార్లు వెనకడుగు వేసినట్టు కూడా కనిపించింది. అయితే, ఫైట్ పూర్తికాకముందే వీడియో ముగిసిపోయినా చాలా మంది మాత్రం పులికే బలం ఎక్కువ అన్న విషయం ఈ వీడియో రుజువు చేసిందని కామెంట్ చేస్తున్నారు. పులి వర్సెస్ సింహం డిబేట్‌కు ఈ వీడియోతో చెక్ పడిందని కామెంట్ చేస్తున్నారు.

Read Viral and Telugu News

Updated Date - Jul 08 , 2024 | 09:08 PM

Advertising
Advertising
<