ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: తన గదిలో దెయ్యాలు ఉన్నాయని బాలిక గోలపెడుతున్నా తల్లిదండ్రులు పట్టించుకోలేదు! చివరకు..

ABN, Publish Date - May 02 , 2024 | 07:01 PM

తన గదిలో దెయ్యాలు ఉన్నాయని బాలిక అన్నా తల్లిదండ్రులు పట్టించుకోలేదు. చివరకు బాలిక గదిలో పెద్ద తేనెతుట్టె చూసి షాకైపోయారు. ఈ ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Honeycomb in Girls room's walls

ఇంటర్నెట్ డెస్క్: తన గదిలో దెయ్యాలు ఉన్నాయని కూతురు అన్నా ఆ తల్లిదండ్రులు పట్టించుకోలేదు. ఏదో తెలీక అలా అంటోందిలే అని అనుకున్నారు. ఆ తరువాత వారికి ఊహించని షాక్ తగిలింది. చిన్నారి గదిలో ఏముందో తెలిశాక వారు దిమ్మెరపోయారు. అమెరికాలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్ (Viral) అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

నార్త్ కెరోలీనాకు చెందిన ఓ దంపతులు తమ కూతురితో కలిసి 100 ఏళ్ల నాటి ఇంట్లో ఉంటున్నారు. వారి కూతురు మూడవ తరగతి చదువుతోంది. ఇటీవల ఓ రోజు వాళ్లు కూతురితో కలిసి ఓ సినిమా చూసొచ్చారు. అందులో కొన్ని దెయ్యాల సీన్లు కూడా ఉన్నాయి. అది చూసొచ్చిన నాటి నుంచీ బాలిక తన గదిలో దెయ్యాలు ఉన్నాయని చెప్పడం మొదలెట్టింది. మొదట తల్లిదండ్రులు చిన్నారి మాటలను కొట్టి పారేశారు. సినిమా చూసిన ఎఫెక్ట్ అయి ఉంటుందని అనుకున్నారు. చిన్నారిని మరిపించే ప్రయత్నం చేశారు (Little Girl Complains About Monster In Room And The Parents Found 50,000 Bees In The Wall).

Viral: సఫారీ జీప్‌పై దాడికి సిద్ధమైన మగ ఏనుగు.. చివరి నిమిషంలో.. షాకింగ్ వీడియో!


అయితే, ఓ రోజు చిన్నారి గది బయట తేనెటీగలు ఎగరడం చూసి తల్లికి అనుమానం వచ్చింది. కాస్తంత నిశితంగా పరిశిలిస్తే గోడలోపల తేనెతుట్టె ఉన్నట్టు అనిపించింది. వెంటనే తల్లిదండ్రులు పెస్ట్ కంట్రోల్ కంపెనీకి సమాచారం అందించారు. వారి వచ్చి చెక్ చేసి ఆశ్చర్యపోయారు. అక్కడ నిజంగానే భారీ స్థాయిలో తేనెటీగలు పోగుపడ్డాయి. గోడలోపల పెద్ద తేనెతుట్టెను కట్టుకున్నాయి. అంత పెద్ద తేనెతుట్టెను తామెప్పుడూ చూడలేదని పెస్ట్ కంట్రోల్ కంపెనీ సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఇల్లు పాతది కావడంతో ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అమెరికా చట్టాల ప్రకారం తేనెటీగలకు హాని చేయకూడదు కాబట్టి వాటిని జాగ్రత్తగా వేరే చోటకు తరలించారు.

Read Viral and Telugu News

Updated Date - May 02 , 2024 | 07:04 PM

Advertising
Advertising