ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Love Bombing: ప్రేమలో పడ్డారా? మీ పార్ట్‌నర్ ఇలాంటి వారైతే జీవితం నాశనం!

ABN, Publish Date - Sep 05 , 2024 | 12:18 PM

నేటి ప్రేమికుల్లో కొందరు లవ్ బాంబింగ్ బాధితులుగా మిగులుతున్నారని సామాజిక అధ్యయనకారులు చెబుతున్నారు. దీని బారిన పడకుండా ఉండేందుకు భాగస్వామి ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో ప్రేమలు ఆన్‌లైన్ బాటపట్టాయి. రకరకాల యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం.. నచ్చితే యస్ చెప్పడం.. ఆ తరువాత ప్రేమలు, షికార్లు..ఇలా సాగిపోతోంది యువత జీవితం. అయితే, ప్రేమ పేరుతో అవతలివారిని లొంగదీసుకుని తమ చెప్పుచేతల్లో పెట్టుకునే కిలాడీల ట్రెండ్ పెరిగిపోతోందని సామాజిక అధ్యయనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని లవ్ బాంబింగ్ (Love Bombing) అంటారని, ఇలాంటి వాళ్లు తారసపడితే వెంటనే వదిలించుకోవాలని సూచిస్తున్నారు (Viral).

USA: పొరపాటున కీలక అవయవాన్ని తొలగించిన డాక్టర్.. రోగి మృతి!


ఏమిటీ లవ్ బాంబింగ్!

అతిగా ప్రేమ కురిపిస్తూ భాగస్వామిని చెప్పుచేతల్లో పెట్టుకోవాలని ప్రయత్నించడమే లవ్ బాంబింగ్. వివిధ దశల్లో అవతలివారిని లొంగదీసుకునేందుకు కిలాడీలు ప్రయత్నిస్తారని చెబుతున్నారు.

ఇందులో భాగంగా తొలి దశలో ప్రేమ పేరిట అవతలివారిని ఉక్కిరిబిక్కిరి చేస్తారు. తమకు మించిన భాగస్వామి దొరకరనే భావన కల్పిస్తారు. ఆ తరువాతే అసలు కథ మొదలెడతారు. ఈ క్రమంలో ప్రేమ ప్రయాణం వేగంగా సాగిపోతున్నట్టు, జీవితంలో త్వరిత గతిన మార్పులు సంభవిస్తున్నట్టు అనిపిస్తుంది.

రెండో దశలోనే అసలు రంగు బయటపడటం మొదలువుతంది. ఇతరుల సమక్షంలో అవతలివారిపై అతిగా ప్రేమను కురిపించడం, ఆ తరువాత అస్సలు పట్టించుకోకపోవడం చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అవమానపరుస్తారు. ఇదంతా ప్రేమలో భాగమనుకునే అమాయకులు పూర్తిగా సరెండర్ అయిపోతారు. వారి ప్రేమ కోసం తహతహలాడుతూ తమ స్వతంత్రతను కోల్పోతారు.


చివరి దశలో విషయం మొత్తం తేటతెల్లమవుతుంది. ప్రేమ పేరుతో ఉక్కిరిబిక్కిరి చేయడాన్ని ప్రశ్నించగా కిలాడీలు అకారణంగా గొడవ పెట్టుకుని బంధాన్ని తెంచేసుకుంటారని, ఆ తరువాత మళ్లీ కనబడకుండా పోతారని చెప్పారు. ఈ తీరుతో బాధితులే తాము తప్పు చేసినట్టు బాధపడే స్థితి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇక లవ్ బాంబింగ్ అనే పదం ప్రస్తుతం ప్రాచుర్యం పొందుతున్నప్పటికీ 1970ల నుంచే ఇది వాడుకలో ఉందట. మతబృందాలు కొన్ని అమలు చేసే వ్యూహాల్ని అప్పట్లో లవ్ బాంబింగ్ అని పిలిచేవారని సమాచారం.

కాబట్టి, ఆన్‌లైన్ ప్రేమల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, మానిప్యులేట్ చేసే వారు తారసపడితే వెంటనే వారికి దూరంగా వెళ్లిపోవాలని చెబుతున్నారు.

Read Latest and Viral News

Updated Date - Sep 05 , 2024 | 12:24 PM

Advertising
Advertising