ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: మనిషితో పందెం.. సింహం తల వంచి ఓటమి ఒప్పుకుందా? షాకింగ్ వీడియో!

ABN, Publish Date - Jun 15 , 2024 | 09:42 PM

టగ్ ఆఫ్ వార్ ఆటలో సింహంపై మనిషి పైచేయి సాధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: పులి, సింహం.. ఆ మాటకొస్తే.. అడవిలో చాలా క్రూర జంతువులు మనిషికంటే కొన్ని రెట్లు బలమైనవి. వాటికి దొరికితే మనిషికి చావు మూడినట్టే. కాన్ని కొన్ని సందర్భాల్లో మనిషే ఈ జంతువులపై పైచేయి సాధించినట్టు భ్రమ కలుగుతుంది. అచ్చు అలాంటి వీడియో నెట్టింట తెగ వైరల్ (Viral) అవుతోంది. కండలు తిరిగిన దేహం కలిగిన ఓ వ్యక్తి సింహంతో పందెం వేసిన వీడియో చూసి జనాలు షాకైపోతున్నారు. మనిషి ధాటికి సింహం వెనకడుగు వేసిందా అంటూ నోరెళ్లబెడుతున్నారు.

దారుణం.. అందమైన యువతి మనసులో ఇంతటి క్రూరత్వమా! వైరల్ వీడియో!


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ వ్యక్తి బోనులో ఉన్న సింహంతో ‘టగ్ ఆఫ్ వార్’ ఆడతాడు. అంటే.. ఓ తాడును ఓవైపు మనిషి పట్టుకుని లాగితే మరోవైపును సింహం నోట పట్టి వ్యతిరేక దిశలో లాగింది. తొలుత సింహం మనిషిపై పైచేయి సాధించినట్టే కనిపించింది. నోట తాడును పట్టి గట్టిగా వెనక్కు లాగుతూ చుక్కలు చూపించింది. దాని బలానికి ఆ వ్యక్తి తట్టుకోలేక పోయాడు. ముందుకు తుళ్లిపడ్డాడు. ఆ తరువాత తేరుకున్న అతడు మరింత బలంగా తాడును లాగడంతో సింహమే ముందుకు వచ్చేసింది. రెండో ప్రయత్నంలోనూ మనిషిదే పైచేయి అయ్యింది. అయితే, మూడో ప్రయత్నంలో మాత్రం సింహం తాడును వదిలేసింది. పోటీ పడలేక వెనక్కు తగ్గినట్టు అనిపించింది. మరోవైపు. ఆ వ్యక్తి మాత్రం నేనే గెలిచా అంటూ సంబర పడటం వీడియోలో చూడొచ్చు (Man And lion Battle It Out In Epic Tug Of War Game).


వీడియోలో ఇదంతా చూసిన జనాలు షాకైపోతున్నారు. మడమ తిప్పడం తెలీని సింహం వెనకడుగు వేసిందా అని ప్రశ్నిస్తున్నారు. అయితే, సింహం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కొందరు చెప్పారు. కాసేపు మెత్తార్చుకునేందుకు అది వెనక్క తగ్గింది తప్ప సింహాం శక్తి ముందు భూమ్మీదున్న ఏ మనిషీ ఆగలేడని అన్నారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.

Read Viral and Telugu News

Updated Date - Jun 15 , 2024 | 09:42 PM

Advertising
Advertising