ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: దసరా నాడు టెకీ నిర్వాకం! అమ్మవారి పూజ జరుగుతుండగా లాప్‌‌టాప్ తెరిచి..

ABN, Publish Date - Oct 15 , 2024 | 09:52 PM

దసరా సందర్భంగా దుర్గామాత పూజకు హాజరైన ఓ టెకీ మధ్యలో లాప్‌టాప్ తెరిచి తన పని చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: అవి దుర్గ దేవి మండపంలో జరుగుతున్న దసరా వేడుకలు. భక్తులందరూ అమ్మవారి ముందు నిలబడి భక్తి శ్రద్ధలతో పూజలో లీనమైపోయారు. అక్కడే ఉన్న ఓ భక్తుడు మాత్రం తన లాప్‌టాప్ తెరిచాడు. అతడిని గమనించి ఆశ్చర్యపోయిన జనాలు లాప్‌టాప్‌తో అతడు చేస్తోందేంటో చూసి నోరెళ్లబెట్టారు. బెంగళూరులో జీవితాలు ఇంతేనంటూ కొందరు నిట్టూర్చారు. ఈ ఉదంతం తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

Viral: రైల్వే ఉద్యోగానికి రాజీనామా.. స్పేస్‌ఎక్స్‌లో జాబ్! టాలెంట్ అంటే ఇదీ!


దేశ ఐటీ రాజధాని బెంగళూరులో టెకీల జీవితాలు నిత్యం ఉరుకుల పరుగులతో కూడి ఉంటాయి. చాలా మంది టెకీలు క్షణం తీరిక లేకుండా పనిలో మునిగిపోతుంటారు. ఒక్కోసారి నిద్రాహారాలకు కూడా దూరమవుతుంటారు. ఇక పండగలు, ఇతర శుభకార్యాల గురించి సరేసరి. ట్రాఫిక్‌లో కూడా పనిచేస్తున్న కొందరు టెకీల దృశ్యాలు కూడా గతంలో వైరల్ అయ్యాయి. తాజా ఉదంతంలో కూడా పాపం..ఆ టెకీకి ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఉద్యోగబాధ్యతల కారణంగా అతడు పండగ పూట కూడా విధుల్లో పాల్గొనాల్సి వచ్చింది. కానీ, పండగపూట అమ్మవారి పూజ చేయకుండా ఉండటం భావ్యం కాదనుకున్నాడో ఏమో కానీ అతడు తన వెంట లాప్ టాప్ కూడా తెచ్చుకుని పనిలో నిమగ్నమయ్యాడు. ఓవైపు లాప్‌టాప్ చూసుకుంటూ మరోవైపు ఫోన్‌లో మాట్లాడుతూ పని చేశాడు. అప్పుడప్పుడూ తలెత్తి అమ్మవారి పూజను కూడా వీక్షించాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి ఇదంతా రికార్డు చేసి నెట్టింట పెట్టాడు.

Viral: గ్రహాంతరవాసులు ఉన్నారు! త్వరలో శాస్త్రవేత్తల కీలక ప్రకటన!!


జనాలు మాత్రం ఆ టెకీ తీరును విమర్శించారు. ఒకసారి లాప్‌టాప్ కట్టేశామంటే పని ముగిసినట్టేనని అన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇలా ఆఫీసు బాధ్యతలు నెత్తికి ఎత్తుకోవడం తప్పని చెప్పుకొచ్చారు. అటు పూజాకార్యక్రమంపై మనసు పెట్టలేక, ఇటు విధులను సరిగా నిర్వర్తించలేక రెంటికి చెడ్డ రేవడిగా ఈ తరం మారుతోందని అన్నారు. ఈ విషతుల్య పని సంస్కృతిని వదిలించుకోవాలని, వృత్తిగత, వ్యక్తిగత జీవితాల మధ్య కచ్చితమైన విభజన పాటించాలని అభిప్రాయపడ్డారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Viral: ఇలాంటి కోడలు దొరకాలంటే పెట్టిపుట్టాలి.. ఈ వృద్ధ జంట నిజంగా లక్కీ!

Read Latest and Viral News

Updated Date - Oct 15 , 2024 | 09:57 PM