Break A Lock: వామ్మో..ఇదేం మ్యాజిక్ రా బాబూ.. తాళంపై పెట్రోల్ పోసి నిప్పంటిస్తే..
ABN, Publish Date - Mar 23 , 2024 | 08:11 PM
తాళం చెవులు అవసరం లేకుండానే తాళానికి నిప్పు పెట్టి తెరుచుకునేలా చేశాడో యువకుడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: తాళం చెవులు పొగొట్టుకున్న అనేక మంది తాళాలు విరగొట్టేందుకు నానా యాతనా పడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలనే దానిపై నెట్టింట్లో రకరకాల చిట్కాలు అందుబాటులో ఉన్నాయి (Break A lock). కొన్ని ట్రిక్స్ అనుకున్న ఫలితాన్ని ఇస్తే మరికొన్నింటితో ఎటువంటి ప్రయోజనం ఉండదు. అయితే, నెట్టింట ప్రస్తుతం వైరల్ (Viral Video) అవుతున్న ఓ వీడియో మాత్రం జనాలు కంగుతినేలా చేస్తోంది. తాళాలను ఇలా కూడా పగలగొడతారా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
Diesel Bikes: ప్రపంచంలో డీజిల్ బైకులు ఎందుకు లేవో తెలుసా?
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ యువకుడు తాళానికి నిప్పు పెట్టి తెరుచుకునేలా చేశాడు. ముందుగా అతడు ఓ తాళంపై పెట్రోల్ పోసి నిప్పంటిచ్చాడు. అగ్గిపుల్ల వెలిగించి మంట అంటించగానే ఒక్కసారిగా తాళం చుట్టు మంటలు వ్యాపించాయి. అవి పూర్తిగా ఆరిపోయే వరకూ వేచి చూశాక ఓ రాయి తెచ్చి తాళాన్ని కొట్టడంతో వెంటనే అది తెరుచుకుంటుంది. మంట ఆరిపోయాక దానంతట అదే తాళం తెరుచుకుంటుందని చెప్పిన యువకుడు అలా జరక్కపోవడంతో రాయితో కొట్టాడు. దీంతో, అది తెరుచుకుంది. దీంతో, యువకుడి ట్రిక్ (Lock set on Fire) చూసి అక్కడున్న వారందరూ నోరెళ్లబెట్టారు. అసలు ఇదెలా సాథ్యమైందని ప్రశ్నించారు.
Viral Video: యువకుడిపై పగ తీర్చుకున్న తేనెటీగల దండు.. ఒళ్లుగగుర్పొడిచే దృశ్యం
ఈ ప్రశ్నకు యువకుడు సవివరమైన సమాధానం ఇచ్చాడు. చాలా మటుకు తాళాల్లోపలి భాగాల్లో కొద్ది మొత్తంలో ప్లాస్టిక్ పూత ఉంటుందట. అది కరిగిపోగానే తాళం లోపలి భాగాలు విడివడి తాళం ఊడొస్తుందని అతడు చెప్పాడు. లోపలి ప్లాస్టిక్ కరిగిపోయేందుకు తాళంపై పెట్రోల్ పోసి నిప్పంటించానన్నాడు.
Viral Video: ప్రపంచంలో అత్యంత క్రూరమైన చేప! మొసలి కూడా క్షణాల్లో ఖతం! షాకింగ్ వీడియో
ఇక వీడియో చూసిన జనాలు తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటివరకూ ఈ వీడియోకు ఏకంగా 60 లక్షల వ్యూస్ వచ్చాయంటే ఈ వీడియో ఎంతగా వైరల్ అవుతోందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే, చాలా మంది మాత్రం యువకుడు ఈ ట్రిక్ బయటపెట్టినందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. దొంగలు ఇలాంటివి తెలుసుకుని రెచ్చిపోతారని హెచ్చరించారు. అయితే, తాళంలేనప్పుడు లాక్ ఓపెన్ చేసేందుకు ఇంకా బోలెడు ట్రిక్స్ నెట్టింట అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Mar 23 , 2024 | 08:22 PM