ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఈ ఐడియా ఏదో బాగుందే.. సబ్బు లేకుండానే పాత్రల క్లీనింగ్.. నువ్వు సూపర్ బాసూ...

ABN, Publish Date - Jan 23 , 2024 | 03:29 PM

కొందరు చుట్టూ ఉన్న వస్తువులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. మరికొందరు వాటితో ఎవరూ చేయని ప్రయత్నాలు చేస్తూ అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఎందుకూ పనికిరావు అనుకున్న వాటితో...

కొందరు చుట్టూ ఉన్న వస్తువులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. మరికొందరు వాటితో ఎవరూ చేయని ప్రయత్నాలు చేస్తూ అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఎందుకూ పనికిరావు అనుకున్న వాటితో కొందరు అద్భుతాలు చేయడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి సబ్బు, నీరు లేకుండానే పాత్రలను శుభ్రం చేయడం చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రాజస్థాన్‌కు (Rajasthan) చెందిన ఓ వ్యక్తి ఎడారి బస చేశాడు. ఈ సందర్భంగా అక్కడే వంట కూడా చేసుకున్నాడు. ఇందులో విశేషం ఏముందీ అని అనుకుంటున్నారా.. కానీ ఇక్కడే అతను అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. భోజనం చేయడం పూర్తయ్యాక.. పాత్రలను శుభ్రం చేయడం కామనే.. కానీ ఇతను శుభ్రం చేసిన విధానమే కొత్తగా ఉంది. అంతా పాత్రలను సబ్బు, నీటితో శుభ్రం చేస్తే.. ఇతడు మాత్రం వెరైటీగా అక్కడున్న (Clean the cooking utensils with sand) ఇసుక, మట్టితో శుభ్రం చేసేశాడు.

Viral Video: మొత్తానికి కోతితోనే డీల్ కుదుర్చుకున్నాడుగా.. పది రూపాయల పండు ఇచ్చి..

సమయానికి సబ్బు దొరకలేదేమో గానీ.. ‘‘సబ్బుతో పనేముందీ... చెంతనే ఇసుక ఉండగా’’.. అని అనుకుంటూ వెంటనే నేలపై ఉన్న ఇసుకను పాత్రలో వేసి అటూ ఇటూ తిప్పుతూ రుద్దేశాడు. ఇలా రెండు మూడు సార్లు చేయగానే.. పాత్ర అడుగున ఉన్న మురికిపోయి తళతళలాడింది. ఇలా అతను సబ్బు, నీరు లేకుండా పాత్రలను శుభ్రం చేశాడన్నటమాట. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మధ్యప్రదేశ్ విలేజ్ ప్రాంతాల్లో.. ఇప్పటికీ వరి పొట్టు, బూడిదతోనే పాత్రలు శుభ్రం చేస్తారు’’.. అని కొందరు, ‘‘బెంగళూరు వంటి ప్రాంతాల్లో నీటి కంటే ఇసుక ధరే ఎక్కువ’’.. అంటూ మరికొందరు, ‘‘మీ ఐడియా అదుర్స్’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 74వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Optical illusion: ఇక్కడున్న వందలాది రొట్టెల మధ్య పిల్లి దాక్కుని ఉంది.. 7 సెకన్లలో కనిపెట్టగలరేమో ట్రై చేయండి..

Updated Date - Jan 23 , 2024 | 03:29 PM

Advertising
Advertising