ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: కస్టమర్ ఆగ్రహం! కొత్త కారుతో షోరూమ్‌ను ఢీకొట్టిన వైనం!

ABN, Publish Date - Dec 13 , 2024 | 07:09 PM

సరిగా నడవని కారును తనకు అంటగట్టారంటూ ఆగ్రహంతో ఊగిపోయిన ఓ కస్టమర్ షోరూంను కారుతో ఢీకొట్టాడు.

ఇంటర్నెట్ డెస్క్: సరిగా నడవని కారును తనకు అంటగట్టారంటూ ఆగ్రహంతో ఊగిపోయిన ఓ కస్టమర్ షోరూంను కారుతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అమెరికాలో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది (Viral).

స్థానిక మీడియా కథనాల ప్రకారం, మైఖేల్ ముర్నే అనే వ్యక్తి ఇటీవల యూటాలోని ఓ షోరూంలో సూబరూ ఔట్‌బ్యాక్ కారును నాలుగు వేల డాలర్లు చెల్లించి కొన్నాడు. ఆ తరువాత తిరిగొచ్చిన మైఖేల్ కారులో మెకానికల్ లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. తాను చెల్లించిన డబ్బును తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశారు. వాహనం వినియోగానికి పనికి రాదని మండిపడ్డారు. అయితే, షోరూం మేనేజర్ మాత్రం ఇందుకు నిరాకరించారు. యాజ్ ఈజ్ స్థితిలో కారును విక్రయించామని, ఈ లావాదేవీలో డబ్బులు రిఫండ్ చేసే అవకాశమే లేదని స్పష్టం చేశారు.

Viral: సోషల్ మీడియాలో జనాల సానుభూతితో డబ్బులు దండుకున్న వ్యక్తి జైలుపాలు


ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన మైఖేల్ తన డబ్బులు తిరిగివ్వకపోతే కారుతో షోరూంలో క్రాష్ చేస్తాని వార్నింగ్ ఇచ్చాడు. ఆ తరువాత కొంత సేపటికి తిరిగొచ్చిన అతడు కారును డ్రైవ్ చేసుకుంటూ షోరూంలోకి దూసుకెళ్లాడు. షోరూంలోపలున్న డెస్క్‌ను ఢీకొట్టడంతో అది ధ్వంసమైంది. మైఖేల్ చర్య కారణంగా పది వేల డాలర్ల నష్టం వాటిల్లిందని షోరూమ్ మేనేజర్ చెప్పుకొచ్చారు. కారు కొనుగోలు ఒప్పంద పత్రంలో రిఫండ్‌కు ఆస్కారం లేదని స్పష్టంగా పేర్కొన్నామని వెల్లడించారు.

Viral: రహదారిపై క్రాష్ ల్యాండింగ్.. రెండు ముక్కలైన విమానం!


‘‘డాక్యుమెంట్‌లో గులాబీ రంగు అక్షరాల్లో స్పష్టంగా కనబడేలా ‘యాజ్-ఈజ్’ స్థితిలో కారు అమ్ముతున్నట్టు పేర్కొంటారు. కారును మేము తనిఖీ చేయలేదు. కాబట్టి, అది కస్టమర్ల బడ్జెట్‌లోపు ఉంటే కొనుక్కోవచ్చు. అమ్మడానికి మాకు అభ్యంతరం ఉండదు’’ అని మేనేజర్ ఒప్పంద వివరాలను చెప్పుకొచ్చారు.

కాగా, మైఖేల్ కారు ఢీకొని షోరూం అద్దాలు పగిలిపోయాయి. గాజు ముక్కలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఘటన సమయంలో షోరూంలో కనీసం ఏడుగురు ఉన్నారు. అయితే, కారు రాకడను ముందే గమనించిన వారు పక్కకు తప్పుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. షోరూంలో విధ్వంసం సృష్టించాక కారు దిగిన మైఖేల్ నేను ముందే చెప్పానుగా అంటూ వార్నింగ్ ఇవ్వడం వీడియోలో స్పష్టంగా కనిపించింది.

Viral: షాకింగ్ వీడియో! ఈ భారతీయ యువకుడు బంగ్లాదేశ్‌లో ఏం చేశాడో చూస్తే..

Read Latest and Viral News

Updated Date - Dec 13 , 2024 | 07:14 PM