ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఇదేం టాలెంట్‌‌రా బాబూ.. తన కటింగ్ తానే చేసుకున్న యువకుడు!

ABN, Publish Date - Jul 21 , 2024 | 10:20 PM

ఓ యువకుడు సెలూన్ షాపునకు వెళ్లి మరీ తనకు తానే కటింగ్ చేసుకున్న ఘటన తాలూకు వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. అతడి టాలెంట్ చూసి జనాలు షాకైపోతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: లైఫ్‌లో ఎవరి పనులు వారే చేసుకోవడం నేర్చుకోవాలని, ఇతరులపై ఆధారపడటం తగ్గించుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ఇది అక్షర సత్యం. కానీ కొన్ని పనులు మాత్రం ఇతరుల సాయం లేకుండా చేయడం కష్టం. కంటింగ్ అలాంటిదే అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. కానీ ఈ భావన తప్పని ఓ యువకుడు నిరూపించాడు. ఇందుకు సంబందించిన వీడియో వైరల్ (Viral) అవుతుండగా అతడి ఫీట్ చూసి జనాలు షాకైపోతున్నారు.

Viral: మరణ శిక్షకు ముందు కోర్టులో ఖైదీ వింత కోరిక


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఆ యువకుడు కటింగ్ షాపులోకి వెళ్లి మరీ తన కటింగ్ తానే చేసుకున్నాడు. అద్దంలో చూసుకుంటూ నెత్తి వెనకవైపు జుట్టును అత్యంత ఒడుపుగా కత్తిరించుకున్నాడు. చాలా జాగ్రత్తగా జుట్టు తీరు చెడిపోకుండా ఈ పని చేసుకున్నాడు. అసలు ఇది నిజమా లేక గ్రాఫిక్సా అన్న రేంజ్‌లో ఉందీ సీన్. ఎప్పటి నుంచో తనకు తానే కటింగ్ చేసుకుంటున్నట్టు వీడియోలోని యువకుడు రెచ్చిపోయాడు. బాగా పెరిగిన జుట్టును చకచకా, ఏ మాత్రం తడబాటు లేకుండా అతడు కటింగ్ చేసుకున్న తీరు అసాధారణంగా ఉంటుంది. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం తెలియరాలేదు (Man cutting his own hair in salon amazes social media users ).


ఇలాంటి అసాధారణ ఫీట్ ముందెన్నడూ చూడని నెటిజన్లు షాకైపోతున్నారు. ఇతడో సూపర్ హీరో అని కామెంట్ చేస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ అంటే ఇదేనంటూ కొందరు సెటైర్లు పేల్చారు. సెలోన్ షాపు వాళ్లు తమ కటింగ్ ఎలా చేసుకుంటారో ఇన్నాళ్లకు అర్థమైందని ఓ వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో సెన్సేషన్‌‌గా మారింది. ఇప్పటివరకూ లక్షల పైచిలుకు కామెంట్స్, వేల కొద్దీ కామెంట్స్ వచ్చిపడుతున్నాయి.

Read Viral and Telugu News

Updated Date - Jul 21 , 2024 | 10:20 PM

Advertising
Advertising
<