ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: భార్యను కలిసేందుకు 4.4 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర! ఇదో విచిత్ర ప్రేమ కథ!

ABN, Publish Date - Nov 22 , 2024 | 03:07 PM

భార్యతో ఒక్కటయ్యేందుకు ఏకంగా 4.4 వేల కిలోమీటర్ల సైకిల్ జర్నీ చేశాడో చైనా వ్యక్తి. అతడి విచిత్ర ప్రేమ కథ ప్రస్తుతం సంచలనంగా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: భార్య తీరుతో చిరాకొచ్చి ఏకంగా విడాకులు తీసుకున్నాడు. ఎడబాటు తట్టుకోలేక మళ్లీ ఆమెను రెండోసారి పెళ్లాడాడు. కానీ ఈసారీ వారి కాపురం సజావుగా సాగలేదు. దీంతో, రెండోసారీ ఈ జంటకు ఎడబాటు తప్పలేదు. అయితే అతడు భార్యకు దూరంగా ఉండలేకపోయాడు. ఎలాగైనా ఆమెను మళ్లీ తనదాన్ని చేసుకోవాలనుకున్నాడు. చివరకు 4.4 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసి విజయం సాధించాడు. దీంతో, ఈ విచిత్ర చైనా ప్రేమికుడి ఉదంతం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశం అవుతోంది. భలే లవ్ స్టోరీ అంటూ జనాలు ముక్కున వేలేసుకునేలా చేస్తోంది (Viral).

Viral: వావ్.. టాటాల రూ.7 వేల కోట్ల ఆఫర్‌ను కాదన్న ఈమె ఎవరో తెలిస్తే..


చైనాకు చెందిన జావ్‌కు 2007లో వివాహమైంది. అతడి భార్య పేరు లీ. వారికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కానీ భార్యాభర్తలిద్దరికీ పంతాలు, పట్టుదల ఎక్కువ కావడంతో గొడవలు పెరిగాయి. చివరకు 2013లో విడాకులు తీసుకున్నారు. అది తప్పని ఆ ఇద్దరికీ అర్థమైంది. దీంతో, మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత కూడా పాత కథే పునరావృతం కావడంతో మళ్లీ విడిపోయారు. కానీ, జావ్ భార్యకు దగ్గరయ్యేందుకు మళ్లీ ప్రయత్నాలు మొదలెట్టాడు. ఇద్దరి మధ్యా మాటలు మొదలయ్యాయి. తమ కాపురం చక్కదిద్దుకునేందుకు ప్రయత్నిద్దామని అనుకున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల ఓ రోజు జావ్ తన భార్య లీకి ఫోన్ చేశాడు. తాను లాసా వెళుతున్నట్టు ఆమె చెప్పింది. తమ కాపురం బాగుపడాలంటే లాసాకు సైకిల్ తొక్కుకుంటూ రావాలని సరదాగా జోక్ చేసింది. అతడు మాత్రం ఆమె చెప్పింది సీరియస్‌గా తీసుకుని అన్నంత పనీ చేశాడు. 100 రోజుల పాటు శ్రమపడి ఆమెను చేరుకున్నాడు. ఆమె మనసు మార్చి మళ్లీ తనదాన్ని చేసుకున్నాడు.

Viral: దేవత అంటే ఈమెనే! లాటరీలో గెలిచిన రూ.121 కోట్లతో..


‘‘మా మధ్య తీవ్రమైన గొడవలు ఏమీ లేవు. ఇద్దరం మొండి ఘటాలమే. ఇగోలు ఎక్కువ. దీంతో, మాటామాటా పెరిగి, పంతాలు పట్టింపులు ఎక్కువై క్షణికావేశంలో విడిపోయాం. మళ్లి కలుసుకున్నాం. మళ్లీ విడిపోయాం’’ అంటూ తమ విచిత్ర బంధం గురించి చెప్పుకొచ్చాడు.

తన కోసం భర్త ఏకంగా 4.4 వేల కిలోమీటర్ల సైకిల్ తొక్కడం చూసి లీ కూడా ఆశ్చర్యపోయింది. ‘‘నేను అతడితో జోక్ చేశా. నేను కావాలనుకుంటే సైకిల్ తొక్కుకుంటూ రావాలని సరదాగా జోక్ చేశా. అతడు దాన్ని ఇంత సీరియస్‌గా తీసుకుంటాడని అనుకోలేదు’’ అని లీ చెప్పుకొచ్చింది. భర్త ప్రేమను అర్థం చేసుకున్న ఆమె అతడితో కలిసి జీవించేందుకు రెడీ అయ్యింది.

అయితే, భార్యను చేరుకునేందుకు జావ్ అనేక కష్టనష్టాలకోర్చి ఈ జర్నీ చేశాడు. ఓసారి సైకిల్ తొక్కుతుండగా ఎండదెబ్బ తగిలి అతడు ఆసుపత్రి పాలయ్యాడు. రెండోసారి తీవ్ర డీహైడ్రేషన్ బారిన పడి మూర్ఛపోయాడు. జావ్ కష్టాలు విన్నాక లీకి అతడి ప్రేమలో నిజాయతీ కనిపించింది. దీంతో, ఆ దంపతులు మళ్లీ ఒక్కటయ్యారు. అయితే, తన సైకిల్ జర్నీలను మాత్రం ఆపేది లేదని జావ్ చెబుతున్నాడు. ఈ సారి తాను నేపాల్, యూరోప్‌కు సైకిల్ జర్నీలు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పాడు.

Viral: ఒకటో తరగతి ఫీజు రూ.4.27 లక్షలు.. బాలిక తండ్రి గగ్గోలు

Read Latest and Viral News

Updated Date - Nov 22 , 2024 | 04:51 PM