Viral: పక్కకు తొలగిన మోకాలి కీలు.. ఉత్త చేతులతో సరిచేశాడుగా! షాకింగ్ వీడియో!
ABN, Publish Date - May 17 , 2024 | 03:14 PM
తీవ్ర గాయం కారణంగా పక్కకు తొలగిన మోకాలి కీలును ఓ వ్యక్తి ఉత్త చేతులతో సరిచేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఆసుపత్రిలో అందించాల్సిన చికిత్సను ఇలా చేయడం చూసి జనాలు షాకైపోతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: తీవ్ర గాయం కారణంగా పక్కకు తొలగిన మోకాలి కీలును ఓ వ్యక్తి ఉత్త చేతులతో సరిచేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా (Viral) మారింది. ఆసుపత్రిలో అందించాల్సిన చికిత్సను ఇలా చేయడం చూసి జనాలు షాకైపోతున్నారు. చికిత్స చేసిన వ్యక్తి సుశిక్షితుడైన డాక్టరా? కాదా? అని కొందరు సందేహం వ్యక్తం చేశారు.
@masterchrisleon అనే ఇన్స్టా అకౌంట్లో ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఏదో ఆట ఆడుకుంటున్న సమయంలో ఓ వ్యక్తి మోకాలి కీలు పక్కకు తొలగిపోతుంది. దెబ్బకు కింద పడిపోయిన అతడు నొప్పి భరించలేక పెద్ద పెట్టున అరవడం ప్రారంభించాడు. ఇంతలో పక్కనే ఉన్న ఓ వ్యక్తి రంగంలోకి దిగాడు. జాగ్రత్తగా బాధితుడి కాలును పట్టుకుని పక్కకు తొలగిన ఎముకను సరిచేశాడు. రెండు చేతులతో కీలుపై జాగ్రత్తగా ఒత్తి సరైన స్థానంలోకి వచ్చేలా చేశాడు. బాధితుడు నొప్పి తాళలేక అరుస్తున్న సమయంలోనే క్షణకాలంలో ఈ చికిత్సను పూర్తి చేశాడు (Man Fixes Dislocated Knee Within Seconds).
Viral: మహిళ అకౌంట్లో పొరపాటున రూ. 6 కోట్లు.. దేవుడిచ్చాడనుకుని ఆమె..
అయితే, ఉత్కంఠ భరింతగా సాగిన ఈ వీడియో చూసి జనాలు భయపడిపోతున్నారు. ఇలాంటి చికిత్సలు ఆసుపత్రుల్లో మాత్రమే చేయాలని అనేక మంది అన్నారు. అనుభవం, శిక్షణ లేని వాళ్లు ఇలాంటి ప్రయోగాలు చేస్తే ప్రతికూల పర్యవసానాలు ఎదురవుతాయని హెచ్చరించారు. అయితే, ఈ ఘటన ఇండోనేషియాలోని జకార్తా జరిగిందని కొందరు చెబుతున్నారు. ఈ చికిత్స చేసిన వ్యక్తి పేరు క్రిస్ అని, అతడు చైనా సంప్రదాయక వైద్య విధానాలతో కీళ్లు, ఎముకల సమస్యలను సరిచేస్తుంటాడని కొందరు చెప్పుకొచ్చారు. ఇలాంటి సమస్య తమకూ ఎదురైందని, పరిస్థితి చక్కదిద్దేందుకు సర్జరీ అవసరం పడిందని కొందరు తెలిపారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్గా మారింది.
Updated Date - May 17 , 2024 | 03:19 PM