Viral: దేవుడా.. తల్లికి తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టిచ్చిన పుత్రరత్నం!
ABN, Publish Date - Mar 22 , 2024 | 06:12 PM
మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి తన చర్మంతో చేసిన చెప్పులను తల్లికి బహుమతిగా ఇచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం పిల్లలకు అసాధ్యం! అయితే, తల్లిపై కనీనం మాతృభక్తినైనా గొప్పగా చాటుకోవాలనుకున్నాడో పుత్రరత్నం. ఈ క్రమంలో ఆమెకు తన చర్మంతో చెప్పులు కుట్టి ఇచ్చాడు. ఇంతటి అసాధారణ చర్యకు పూనుకున్న వ్యక్తి పేరు రౌనక్ గుర్జర్. మధ్యప్రదేశ్‌లోని (MadhyaPradesh) ఉజ్జైన్‌లో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా(Viral) మారింది.
Viral: డ్రైవర్ దణ్ణం పెట్టగానే వదిలేసిన ఏనుగు..లేకపోతే వీళ్లు ఏమైపోయేవారో!? షాకింగ్ వీడియో
ఉజ్జెయిన్‌కు(Ujjain) చెందిన గుర్జర్ అసలు తనకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో సవివరంగా మీడియా తెలిపాడు. ‘‘నేను ప్రతిరోజూ రామాయణం చదువుతాను. రాముడి వ్యక్తిత్వం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. చర్మంతో చెప్పులు కుట్టిచ్చినా తల్లి రుణం తీరదని రాముడే స్వయంగా అన్నాడు. ఇది చదివాక నాకు ఈ ఐడియా వచ్చింది. దీంతో, నా చర్మంతో చెప్పులు కుట్టి తల్లికి బహుమతిగా ఇచ్చాను. సమాజానికి నేను చెప్పేదేంటంటే తల్లిదండ్రుల పాదాల వద్ద స్వర్గం ఉంటుంది. ఆ స్వర్గానికి నిచ్చెన తండ్రి అయితే తల్లి మనల్ని అక్కడకు చేరుస్తుంది’’ అని అతడు చెప్పుకొచ్చాడు. ఇటీవల అక్కడ జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో తల్లికి తను తయారు చేయించిన తెచ్చిన చెప్పులను బహుమతిగా ఇచ్చి ఆశీర్వాదం పొందాడు (Man Gifts mother slippers made of His skin).
Viral: 81 ఏళ్ల మహిళకు కడుపు నొప్పి.. 56 ఏళ్లుగా ఆమె కడుపులో ఉన్నది ఇదా అంటూ నివ్వెరపోయిన వైద్యులు!
అయితే, తల్లికి ఈ చెప్పుల విషయం ముందుగా తెలీకూడదని గుర్జర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అతడు తొలుత ఆపరేషన్ ద్వారా తన తొడపై ఉన్న చర్మాన్ని ఒలిపించుకున్నాడు. ఆ తరువాత మరో వ్యక్తికి ఈ చర్మం ఇచ్చి చెప్పులు కుట్టించాడు. అనంతరం మార్చి 14 - 21 మధ్య ఏడు రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో తల్లికి ఆ చెప్పులను భక్తితో బహుమతిగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Mar 22 , 2024 | 06:18 PM