ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: ఇంత టాలెంట్‌గా ఉన్నారేంటి భయ్యా.. ఫోటో చూస్తే షాకే..!

ABN, Publish Date - Aug 28 , 2024 | 08:08 PM

కళ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు.. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు అని ఒక డైలాగ్ ఉంది. ఇది మనుషుల జీవితానికి సరిగ్గా సరిపోలుతుంది. వ్యక్తి ఎదుర్కొన్న పరిస్థితులు, చూస్తున్న పరిసరాలు.. వారిని ఎంతో ప్రభావితం చేస్తాయి. ఆ ప్రభావం ఫలితంగానే వారి ఆలోచనా..

Viral News

హైదరాబాద్, ఆగష్టు 28: కళ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు.. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు అని ఒక డైలాగ్ ఉంది. ఇది మనుషుల జీవితానికి సరిగ్గా సరిపోలుతుంది. వ్యక్తి ఎదుర్కొన్న పరిస్థితులు, చూస్తున్న పరిసరాలు.. వారిని ఎంతో ప్రభావితం చేస్తాయి. ఆ ప్రభావం ఫలితంగానే వారి ఆలోచనా విధానల్లోనూ వైవిధ్యం కనిపిస్తుంది. అందుకే అంటారు.. అనుభవమే గుణపాఠం అని. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటన సరిగ్గా అనుభవానికి సంబంధించినదే.


హైదరాబాద్‌లో వాన చిన్న వాన పడితేనే పరిస్థితి ఎంత భీకరంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. రోడ్లన్నీ జలమయం అయి.. నాలాలు పొంగి పొర్లుతుంటాయి. చిన్నపాటి వర్షాల కారణంగా నగర వాసులు ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇక వరద నీటిలో వాహనాలు కొట్టుకుపోయిన సందర్భాలు కోకొల్లలు. ఇటీవల వర్షం కురిసిన సందర్భంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వాహనదారులు తమ బైక్‌తో సహా కొట్టుకుపోయిన ఘటనలు వెలుగు చూశాయి. ఇక పార్క్ చేసిన బండ్లు అయితే ఎక్కడి వరకు కొట్టుకుపోయాయో కూడా తెలియని పరిస్థితి.


ఈ పరిస్థితిని చూసే కొందరు నగరవాసులు ముందుగానే తేరుకుంటున్నారు. హైదరాబాద్‌లో వానలు ఎప్పుడు కురుస్తాయో.. ఎప్పుడు నాలాలు పొంగి ప్రవహిస్తాయో తెలియని పరిస్థితి. అందుకే.. నగరంలోని కొందరు వాహనదారులు ముందుగానే అలర్ట్ అవుతున్నారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తమ వాహనాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.


తాజాగా రాంనగర్‌లోని పార్శీగుట్టలో ఓ వ్యక్తి తన టూవీలర్‌ను ఇంటి మెట్ల దిమ్మె మీదకు ఎక్కించి పార్క్ చేశారు. ఎందుకిలా? అంటే.. తమ ఏరియాలో వర్షం వస్తే వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుందని, నీరు కూడా అధికంగా నిల్వ ఉంటుందని చెబుతున్నారు. బైక్ కింద పార్క్ చేస్తే నీటిలో కొట్టుకుపోవడం గానీ, మునిగిపోయి పాడైపోవడం గానీ జరుగుతుందని అంటున్నారు. అందుకే ఇంటి మెట్ల దిమ్మె మీద తమ బైక్‌ను పార్క్ చేశామని చెబుతున్నారు. అయితే, ఈ బైక్ పార్కింగ్‌ను చూసిన బాటసారులు.. అవాక్కవుతున్నారు. ఈ పార్కింగ్‌కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి భయ్యా అని కామెంట్స్ పెడుతున్నారు. ఎంతైనా అనుభవం నేర్పిన గుణపాఠం కదా ఇదంతా!


Also Read:

For More Viral News and Telugu News

Updated Date - Aug 28 , 2024 | 08:08 PM

Advertising
Advertising