ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఇలాంటి తెలివి భారతీయులకే సాధ్యం.. బైక్‌ హ్యాండిల్‌కు ఆ సంచులు ఎందుకు తగిలించాడో తెలిస్తే..

ABN, Publish Date - Dec 30 , 2024 | 05:49 PM

ఇంట్లో నుంచి అడుగు బయటపెడితే చలి వణికించేస్తోంది. మొత్తం శరీరాన్ని మొత్తం బట్టలతో కప్పుకుంటే తప్ప బయటకు వెళ్లడం కష్టంగా మారుతోంది. ఇక, బైక్ మీద వెళ్లాలంటే గ్లౌస్ తప్పనిసరి. పొరపాటున చలిలో చేతులు కప్పుకోకుండా బైక్‌పై ప్రయాణించడానికి ప్రయత్నిస్తే, చేతులు మొద్దుబారడం ఖాయం.

jugaad trick

ప్రస్తుతం చలి కాలం (Winter) వణికిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాదిన చలి విజృంభిస్తోంది. ఇంట్లో నుంచి అడుగు బయటపెడితే చలి (Cold) వణికించేస్తోంది. మొత్తం శరీరాన్ని మొత్తం బట్టలతో కప్పుకుంటే తప్ప బయటకు వెళ్లడం కష్టంగా మారుతోంది. ఇక, బైక్ మీద వెళ్లాలంటే గ్లౌస్ తప్పనిసరి. పొరపాటున చలిలో చేతులు కప్పుకోకుండా బైక్‌ (Bike)పై ప్రయాణించడానికి ప్రయత్నిస్తే, చేతులు మొద్దుబారడం ఖాయం. దానిని నివారించడానికి, ఒక వ్యక్తి తెలివైన పరిష్కారంతో ముందుకు వచ్చాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


maximum_manthan అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. చలి నుంచి తనను తాను రక్షించుకునేందుకు ఆ వ్యక్తి ఒక గోనె సంచిని కట్ చేసి రెండు హ్యాండిల్స్‌పై ఉంచాడు. బైక్ హ్యాండిల్‌కు ఫిట్ అయ్యే విధంగా ఆ గోనె ముక్కలను కట్ చేశాడు. తర్వాత వాటిల్లోకి తన చేతిని దూర్చి హాయిగ్ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. తన తెలివితో చలి నుంచి తన చేతులకు రక్షణ కల్పించాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు కోటి మందికి పైగా వీక్షించారు. 20 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అతను ఇంజనీర్ కంటే తక్కువ కాదు``, ``ఇది చాలా మంచి ఆలోచన, ఇప్పుడు మీ చేతులు బైక్‌పై చల్లగా అనిపించవు``, ``దీని కంటే గ్లౌస్ కొనుక్కోవడం సులభమేమో``, ``ఈ గోనె సంచుల కంటే గ్లౌస్ చలి నుంచి ఎక్కువ రక్షణ కల్పిస్తాయి. పైగా వాటి ఖరీదు కూడా ఎక్కువ కాదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: విచిత్రమైన ఫ్రెండ్‌షిప్.. కుక్క, పీత కలిసి ఏం చేస్తున్నాయో చూడండి.. వీడియో వైరల్..


Viral Video: వామ్మో.. ఎలక్ట్రిక్ వైర్లపై బట్టలు ఆరేస్తున్నాడు.. కిందనున్న వ్యక్తి అడిగితే ఏం చెప్పాడంటే..


Optical Illusion Test: మీ దృష్టికి సరైన పరీక్ష.. వీటిల్లో భిన్నంగా ఉన్న క్యాండీని 5 సెకెన్లలో కనిపెట్టండి..


Viral Video: వధువు మెడలో దండ వేస్తుండగా షాకింగ్ సీన్.. వెనుక నుంచి వచ్చిన అమ్మాయి ఒక్క తన్ను తంతే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 30 , 2024 | 05:49 PM