ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: దేవుడా! కొండ చిలువను పక్కలో పడుకోబెట్టుకుని ఏం చేస్తున్నాడో చూస్తే..

ABN, Publish Date - Dec 09 , 2024 | 10:01 PM

భారీ కొండచిలువను మంచపై పడుకోబెట్టుకుని దాని పక్కనే తనూ పడుకుని పుస్తకం చదివిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: కుక్కలు, పిల్లులను ఇళ్లల్లో పెంచుకోవడం అందరికీ తెలిసిందే. కానీ కొందరు ఏకంగా క్రూర జంతువులను పెంపుడు జంతువుల్లా ఇంట్లోకి తెచ్చి పెట్టుకుంటారు. ప్రమాదకరమైన పాములకూ తమ ఇళ్లల్లో చోటిస్తారు. డాబుదర్పాలు ప్రదర్శించేందుకు కొందరు, సోషల్ మీడియాలో పాప్యులర్ కావాలనేందుకు కొందరు ఇలాంటి దుస్సాహసాలకు పూనుకుంటారు. కొందరేమో తమ ధైర్యసాహసాలను ప్రదర్శించేందుకు ఇలా చేస్తుంటారు. కారణాలేమైనప్పటికీ ఇలాంటి పనులతో ఎప్పటికైనా ప్రమాదం తప్పదు. ఈ నేపథ్యంలో ఓ సాహసికుడి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి జనాలు వణికిపోయేలా చేస్తోంది (Viral).

Viral: పిల్లల్లో దేవుడు ఉంటాడనేది ఇందుకే! వీడియో చూసి నెటిజన్ల కంట కన్నీరు!


మైక్ హోల్‌స్టన్‌ అనే ఇన్‌ఫ్లుయెన్స్ ఇన్‌స్టాలో ‘‘ది రియల్ టార్జన్‌’’గా చాలా పాప్యులర్. అతడికి వేలకొద్దీ ఫాలోవర్లు, లక్షల కొద్దీ వ్యూస్ సాధించిన వీడియోలు ఉన్నాయి. నిత్యం ఏదోక సాహసోపేతమైన చర్యతో అతడు నెట్టింట హల్‌చల్ చేస్తుంటాడు. అతడి తాజా ప్రయత్నం నెట్టింట మునుపటి కంటే ఎక్కువ కలకలానికి దారి తీసింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, అతడు తన బెడ్‌ మీద ఓవైపు కొండచిలువను పడుకోబెట్టుకుని, మరోవైపు తన పెంపుడు కుక్కను పెట్టుకుని పడుకుని తీరిగ్గా పుస్తకం చదివాడు. కొండచిలువ కూడా పెంపుడు కుక్కే అన్న రేంజ్‌లో అసలేమాత్రం భయపడకుండా పుస్తకంలో పేజీలు తిరగేయ్యసాగాడు.

Viral: వీటిల్ని షూస్ అంటారా? ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో!


వీడియోలో ఇదంతా చూసిన జనాలు షాకైపోతున్నారు. కొందరు అతడి సాహసాన్ని పొగిడితే అధిక శాతం మంది మాత్రం ప్రమాదం తప్పదంటూ సెటైర్లు పేల్చారు. ముందుగా కుక్కను తినాలా, మనిషిని తినాలా అని కొండ చిలువ ఆలోచిస్తోందని ఓ వ్యక్తి వ్యాఖ్యానించాడు. ఇతడితో ఉంటే ఏదోక రోజూ తనకు చావు తప్పదని కుక్క భయపడుతుంటుందని మరికొందరు సెటైర్లు పేల్చారు. ఏదోక రోజు హోల్‌స్టన్‌ వీడియోలు పెట్టడం మానేస్తాడు.. అప్పుడు మనకు ఏం జరిగిందో అర్థం అవుతుంది అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. పామును, హోల్‌స్టన్‌ను చూస్తుంటే నేను నా మాజీ ప్రియురాలు ఒకే మంచంపై ఉన్న రోజులు గుర్తొస్తున్నాయని మరో వ్యక్తి జోకు వేశాడు.

కాగా, హాల్‌స్టన్ గతంలోనూ ఇలాంటి దుస్సాహసాలకు పూనుకున్నాడు. ఓమారు ఏకంగా నాగుపామును గట్టిగా చేతులతో పట్టుకుని దాని తలపై ముద్దుపెట్టాడు. ఇతర వీడియోల్లో కూడా అతడు భయానక సర్పాలతో చలగాటమాడాడు. అతడి వీడియోలకు నిత్యం లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి.

Viral: దేవుడా! ఈ ఒక్క ప్రశ్నకు యస్ చెప్పినందుకు 100 మంది ఉద్యోగులకు ఊస్టింగ్!

Read Latest and Viral News

Updated Date - Dec 09 , 2024 | 10:06 PM