ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: 130 ఏళ్ల నాటి కెమెరాతో ఫొటో తీశాడు.. ఎలా ఉందో మీరే చూడండి!

ABN, Publish Date - Oct 04 , 2024 | 01:04 PM

130 ఏళ్ల నాటి పానొరామిక్ కెమెరాతో ఓ వ్యక్తి తీసిన ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నాటి కెమెరా సాంకేతికత, ఫొటో తీసిన విధానం, అందులో వాడిన ఫిల్మ్ ఇత్యాది విషయాలు జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: పిన్ హోల్ కెమెరాలు మొదలు నేటి డిజిటల్ కెమెరాల వరకూ ఫొటోగ్రఫీ పరిణామ క్రమం ఓ అద్భుతమనే చెప్పాలి. నేటి తరానికి ఫొటోగ్రఫీ అంటే ఐఫోన్‌ లాంటి స్మార్ట్ ఫోన్లు గుర్తొస్తాయి కానీ ఒకప్పటి కెమెరాలు, ఫొటో తీసే విధానం చాలా మందికి తెలియదు. అయితే, ఫిల్మ్‌ కెమెరాలతో ఫొటోలు తీయడం ఓ అనుభూతి అని ఫొటోగ్రఫీపై పట్టున్న వారు చెబుతారు. డిజిటల్ కెమెరాలు వాటి దరిదాపుల్లోకి కూడా రావని కచ్చితంగా చెప్పేస్తారు. ఇక ఫొటోగ్రఫీ మొదలైన తొలి నాళ్లల్లో ఈ కళ మరింత సంక్లిష్టంగా ఉండేది. అప్పుడున్న వన్నీ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలే. అయితే, నాటి రోజుల్ని మళ్లి కళ్ల ముందు నిలుపుతూ ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

Viral: మీ తెలివికో పరీక్ష! ఈ 2 బొమ్మల్లో 3 తేడాలను 10 సెకెన్లలో కనిపెట్టగలరా?


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, మైల్స్ హారిస్ అనే వ్యక్తి 130 ఏళ్ల నాటి కెమెరాతో ఫొటో తీశాడు. పురాతన కెమెరాలతో ఫొటోలు తీసి నెట్టింట పంచుకోవడం అతడి హాబీ. పానొరమిక్ కెమెరాతో అతడీ ఫొటోలు తీసుశాడు. ఇంగ్లండ్‌లో ప్రముఖ రెక్ రగ్బీ స్టేడియంలో ఆటను తన కెమెరాలో బంధించాడు. ముందుగా కెమెరా తెరిచి అందులో ప్రత్యేకమైన ఫిల్మ్ పెట్టి ఆ తరువాత క్లిక్ మనిపించాడు. అది పానోరమిక్ కెమెరా కావడంతో రగ్బీ స్టేడియం మొత్తాన్ని క్యాప్చర్ చేయగలిగాడు. అలా వచ్చిన ఫోటోలను నెట్టింట షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి.

Viral: అంతరిక్షం నుంచి దూకి.. గంటకు 1,357 కిలోమీటర్ల వేగంతో కిందకొస్తూ..

ఈ వీడియో యువతను బాగా ఆకట్టుకోవడంతో వైరల్‌గా మారింది. కెమెరా తొలి రోజుల నాటి సాంకేతికతను, ఫొటో తీసే విధానాన్ని చూసి యువత ఆశ్చర్యపోతున్నారు. అస్సలు నమ్మలేనట్టుగా ఉందని కామెంట్ చేశారు. ఆ కెమెరాకు ఎంత చరిత్ర ఉందో ఆ స్టేడియంకు కూడా అంతే చరిత్ర ఉందని కొందరు చెప్పుకొచ్చారు. ఇలాంటి విషయాలు పంచుకుంటున్నందుకు కొందరు ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మైల్స్‌ హారిస్‌కు ఏకంగా ఆరు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అతడు షేర్ చేసే పాతంకాలం ఫొటోలు తెగ వైరల్ అవుతుంటాయి.

Viral: స్ఫూర్తి రగిలించే గెద్ద వీడియో.. ఆనంద్ మహీంద్రా కామెంట్స్ వైరల్!


ఇక ప్రస్తుతం ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లలో కొందరు మిర్రస్ లెస్ కెమెరాలు వాడితే మరికొందరు డీఎస్ఎల్ ఆర్ వైపు మొగ్గు చూపుతారు. తమకు నికాన్ కెమెరాలు నచ్చుతాయని చాలా మంది చెప్పారు. బరువు తక్కువగా ఉన్న కెమెరాలు, ఆటోఫోకస్, సైలెంట్ షూటింగ్, ఇన్ బాడీ స్టెడిలైజేషన్, ఎక్కువ ఫ్రేమ్ రేట్ వంటి ఫీచర్లున్న కెమెరాలతో ఫొటోలు మెరుగ్గా వస్తాయని ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు చెబుతున్నారు.

Read Latest and Viral News

Updated Date - Oct 04 , 2024 | 01:08 PM