ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: గుమ్మడికాయ నుంచి ఊహించని సిగ్నల్! దాన్ని కోసి చూసిన పోలీసులకు షాక్!

ABN, Publish Date - Jul 28 , 2024 | 10:13 PM

గుమ్మడికాయలో బంగారం బిస్కెట్లు దాచి స్మగుల్ చేసిన ఓ దొంగ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నిందితుడి తెలివితేటలు చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: స్మగ్లర్లు రోజురోజుకూ తెలివి మీరి పోతున్నారు. పోలీసుల కళ్లుగప్పి బంగారం, వెండి, ఇతర ఖరీదైన వస్తువులను దేశంలోకి తెచ్చేందుకు గొప్ప గొప్ప ప్లాన్లు వేస్తున్నారు. ఒక్కోసారి వీళ్ల తెలివి చూసి పోలీసులే షాకైపోతుంటారు. అలాంటి ఓ దొంగకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ (Viral) అవుతోంది. ఈ దొంగ తెలివితేటలు చూసి షాకైపోతున్న జనాలు..ఇతడిది 5జీ బ్రెయిన్ అంటూ కామెంట్స్ వరద పారిస్తున్నారు.

Viral: ఎందుకీ ప్రయోగాలు? ఎవరడిగారని? ఈ దోశను చూసి జనాల్లో ఆగ్రహం!


ఘటన ఎక్కడ జరిగిందో తెలీదు కానీ వీడియో మాత్రం జనాలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఓ బ్యాగులో కూరగాయలు తీసుకెళుతున్న వ్యక్తిపై అనుమానం రావడంతో పోలీసులు అతడిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. సంచీలో ఉన్న గుమ్మడికాయను టేబుల్‌పై పెట్టి మెటల్ డిటెక్టర్‌తో చెక్ చేస్తే సిగ్నల్ వచ్చింది. దీంతో, అవాక్కైన పోలీసులు రెండో గుమ్మడికాయనూ పరీక్షించారు. ఇందులోంచి కూడా సిగ్నల్ రాకవడంతో పోలీసుల ఆశ్చర్యపోయి గుమ్మడికాయలను కోసి చూశారు. అందులోంచి బంగారం బిస్కెట్లు బయటపడటంతో దొంగ తెలివికి అక్కడున్న వారందరూ షాకైపోయారు (Man smuggles gold bars stuffed inside pumpkins ).


ఈ ఘటన ఎక్కడ వెలుగు చేసిందీ తెలియదు కానీ నెట్టింట వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవడమే కాకుండా తన అభిప్రాయాలను నెట్టి్ంట పంచుకున్నారు. దొంగ తెలివితేటలు చూసి చాలా మంది షాకైపోయారు. ఇతడిది 5జీ బ్రెయిన్ అని కొందరు కామెంట్ చేశారు. మరికొందరు మాత్రం పోలీసుల నిఘాపై ప్రశంసలు కురిపించారు. దొంగలు ఎంత తెలివిగల వారైనా పోలీసుల కన్నుకప్పి తప్పించుకోలేరంటూ తెగ పొగిడేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

Read Viral and Telugu News

Updated Date - Jul 28 , 2024 | 10:13 PM

Advertising
Advertising
<