Viral: దేవుడా.. గర్ల్‌ఫ్రెండ్ పేరును ఒంటిపై ఎక్కడ టాటూ వేయించుకున్నాడో చూస్తే..
ABN, Publish Date - Feb 27 , 2024 | 03:44 PM
తన పెదవి లోపలివైపు గర్ల్ ఫ్రెండ్ పేరును టాటూ వేయించుకున్న వ్యక్తి. నెట్టింట వీడియో వైరల్
ఇంటర్నెట్ డెస్క్: ప్రేమ కోసం ప్రాణాలు అర్పించిన వారు ఎందరో! వారందరినీ ఈ ప్రపంచం అమర ప్రేమికులని పిలుస్తుంది. అయితే, ప్రేమ కోసం కేవలం టాటూ వేయించుకున్న ఓ వ్యక్తిని మాత్రం నెటిజన్లు చెడుగుడు ఆడుకుంటున్నారు. నీది ప్రేమ కాదు పిచ్చే అంటున్నారు. తను టాటూ ఎక్కడ వేయించుకుందీ తెలిపే వీడియోకు (Viral Video) కోట్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. వీడియోను చూసిన జనాలు నోరెళ్లబెడుతున్నారు.
Viral video: ఎలా అడ్డంగా బుక్కయ్యాడో మీరే చూడండి.. సివిల్ డ్రెస్‌లో ఉన్నది ఐపీఎస్ అధికారని తెలీక..
ఈ వీడియోను అభిషేక్ సప్కాల్ అనే వ్యక్తి గతేడాది డిసెంబర్లో షేర్ చేశాడు. వీడియోలోని వ్యక్తి గర్ల్‌ఫ్రెండ్ పేరు అమృత. ఆ పేరును అతడు ఎవ్వరూ ఊహించని విధంగా పెదవిలోపలివైపు టాటూ వేయించుకున్నాడు. ఈ టాటూ వేయించుకున్న విధానం మొత్తాన్ని వీడియోలో చూడొచ్చు (Man tatooes girlfriends name inside lips).
వీడియా అసాంతం చూసిన జనాలు మాత్రం వివిధ రకాల కామెంట్లతో ఆ ప్రేమికుడితో చెడుగుడు ఆడుకున్నారు. ఇది ప్రేమ కాదు పిచ్చే అంటూ అనేక మంది కామెంట్ చేశాడు. మరొకరు మాత్రం అతడికి అప్పటికే పెళ్లి అయ్యి ఉండొచ్చని అనుమానించారు. ఇలాంటి చోట అయితే భార్యకు టాటూ గురించి అస్సలు తెలీకుండా ఉంటుందని కామెంట్ చేశారు. మరికొందరేమో అతడి దంతాలు సరిగ్గా లేవని ముందు పళ్లు శుభ్రం చేయించుకోమని సలహా ఇచ్చాడు.
గతంలో ఓ బ్రిటన్ వనిత కూడా దాదాపుగా ఇదే చేసింది. బాయ్‌ఫ్రెండ్‌పై తన ప్రేమను నిరూపించుకునేందుకు అతడి పేరును ఏకంగా తన నుదుటిపైనే పచ్చబొట్టు వేయించుకుంది.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Feb 27 , 2024 | 03:52 PM