Viral: మనుషుల్లో ఇంత శాడిజమా! ఆకలితో ఉన్న హిప్పో ఆశగా నోరు తెరిస్తే..
ABN, Publish Date - Jul 12 , 2024 | 05:43 PM
టూరిస్టు ఆహారం పెడతాడనుకుని నోరు తెరిచిన హిప్పోపోటామస్‌కు అతడు ప్లాస్టిక్ బ్యాగ్ ఇచ్చిన దారుణ ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వైరల్ అవుతున్న వీడియో నెటిజన్లకు కోపం తెప్పిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: కొందరికి మూగజీవాలంటే చులకన. వాటిని బాధపెట్టి రాక్షసానందం పొందుతూ ఉంటారు. అలాంటి ఓ వ్యక్తిని నెటిజన్లు ప్రస్తుతం ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు. అతడు చేసిన పని చూసి అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఇండోనేషియాలో వెలుగు చూసిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.
Viral: ఇది నిజమా గ్రాఫిక్సా.. ఆటోవాలా పవర్ అంటే ఇదేనా! షాక్‌లో నెటిజన్లు
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, టమన్ సఫారీ పార్కులో ఈ ఘటన చోటు చేసుకుంది. సఫారీ సందర్శనకు కొందరు టూరిస్టులో ఓ కారులో వచ్చారు. అక్కడే తటాకం నుంచి ఓ హిప్పోపోటామస్ బయటకు వచ్చింది. టూరిస్టులను చూడగానే అది అలవాటు ప్రకారం పెద్దగా నోరు తెరిచింది. ఎప్పటిలాగే టూరిస్టులకులు తనకు ఆహారం పెడతారనుకుని ఆశగా ఎదురు చూసింది. ఈ క్రమంలో కారులోని ఓ వ్యక్తి దానికి కారెట్ అందించే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో కారులోని మరో వ్యక్తి మాత్రం దారుణంగా హిప్పో నోట్లోకి ఏకంగా ఓ ఖాళీ ప్లాస్టిక్ బ్యాగ్ విసిరేశాడు. ఏం జరిగిందో అర్థం చేసుకోలేని హిప్పో ప్లాస్టిక్ బ్యాగ్ నమిలింది. వీడియో అక్కడితో ముగిసిపోవడంతో హిప్పో ప్లాస్టిక్ బ్యాగ్ మింగేసిందా లేదా అన్నిది తెలియరాలేదు (Man throws plastic bag into hippos mouth at safari park Viral video angers Internet).
ఈ వీడియో వైరల్ కావడంతో జనాలు ఆ వ్యక్తిపై మండిపడ్డారు. మూగ జీవంతో ఇలా ఎవరైనా వ్యవహరిస్తారా అంటూ నోరెళ్లబెట్టారు. ఈ లోపు ఘటనపై సఫారీ అధికారులు కూడా స్పందించారు. అప్పటికే పలుమార్లు అతడు సెక్యూరిటీ మాట పట్టించుకోకుండా నిబంధనలు ఉల్లంఘించాడని తెలిపారు. అతడి కారు నెంబర్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నామని కూడా పేర్కొన్నారు.
Updated Date - Jul 12 , 2024 | 05:47 PM