మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: ఈగకు ట్రెయినింగ్ ఇచ్చాడట.. ఇది ఎలాంటి పనులు చేస్తోందో చూడండి! నమ్మశక్యం కానీ సీన్!

ABN, Publish Date - Mar 17 , 2024 | 07:51 PM

ఈగ నాణేన్ని డొల్లిస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: ఈగకు ట్రెయినింగ్ ఇచ్చాడట.. ఇది ఎలాంటి పనులు చేస్తోందో చూడండి! నమ్మశక్యం కానీ సీన్!

ఇంటర్నెట్ డెస్క్: మనుషులకు ట్రెయినింగ్ ఇచ్చి కొత్త విషయాలను నేర్పించొచ్చు. కుక్కలు, పిల్లులు, పక్షులు లాంటి జీవాలకు కాస్తంత కష్టమైనా సరే ట్రెయినింగ్ ఇచ్చి కొన్ని పనులు చేయించుకోవచ్చు. కానీ కీటకాలకు అందులోనూ..ఎవరైనా దగ్గరకు వస్తున్నారంటేనే క్షణాల్లో ఎగిరిపోయే ఈగకు ట్రెయినింగ్(Trained Housefly) ఇవ్వగలమా? కానీ, సరిగ్గా ఇలాంటిదే ఓ అద్భుతం చేసి చూపించాడో వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral Video) మారింది.

Viral: రిఫండ్ ఇచ్చినా ఫ్లిప్‌కార్ట్‌ను వదిలిపెట్టని కోర్టు.. కస్టమర్‌ను వేధించినందుకు భారీ షాక్!

ఈ వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ వ్యక్తి ఈగకు ఊహించని శిక్షణ ఇచ్చాడు. దీంతో, అది అతడినే ఫాలో అవడం ప్రారంభించింది. అతడు తన వేలును ఎక్కడ ఆనిస్తే అక్కడ వాలడం ప్రారంభించింది. అంతేకాదు, ఓ తేలికపాటి నాణేన్ని దాని ముందు నిలబెడితే అది దాన్ని ముందుకు డొల్లించుకుంటూ వెళ్లింది (Unbelievable Stunt). ఎవరికైనా శిక్షణ ఇవ్వొచ్చు అంటూ వీడియోకు ఓ క్యాప్షన్ కూడా ఉండటం కొసమెరుపు.

Viral: థాయ్‌లాండ్‌లో ట్యాక్సీ డ్రైవర్‌కు చుక్కలు చూపించిన భారతీయులు.. అమ్మో..మనోళ్లు మామూలుగా లేరుగా..


ఈ సీన్లు చూసి జనాలకు మతిపోయినంత పనవడంతో వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. వీడియో చూసిన వాళ్లందరూ తాము చూస్తున్నది నమ్మలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని అనేక మంది కామెంట్ చేశారు. అసలు ఇది ఎలా సాధ్యమే ఎవరికైనా తెలుసా అని కొందరు ప్రశ్నించారు. అయితే, కొందరు మాత్రం వీడియోలో మతలబు ఉందని స్పష్టం చేశారు. దీన్ని ఏఐ గ్రాఫిక్స్‌తో సిద్ధం చేసి ఉంటారని అన్నారు. ఈగ వేలును ఫాలో అయిన దృశ్యాలన్ని ఈజీగానే సృష్టించొచ్చుకానీ నాణేన్ని డొల్లించినట్టు దృశ్యాన్ని క్రియేట్ చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని పేర్కొన్నారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య ఈ వీడియో వైరల్‌గా మారింది.

Viral: ఇదేంటి తల్లీ.. నువ్వే ఇలా ఉంటే ఇక విద్యార్థుల పరిస్థితి ఏంటో? నెట్టింట టీచర్ వీడియో వైరల్!

Mineral Water: మినరల్ వాటర్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఎందుకు? ఆ తరువాత తాగితే ఏమవుతుంది?

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 17 , 2024 | 07:55 PM

Advertising
Advertising