ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: చీతా లాగిపెట్టి చెంపపై కొడితే ఎలా ఉంటుందో తెలుసా? షాకింగ్ వీడియో

ABN, Publish Date - May 17 , 2024 | 10:04 PM

పెంపుడు చీతా ఓ వ్యక్తి చెంపపై పంజా విసిరిన వీడియో వైరల్‌గా మారింది. క్రూర జంతువులను పెంపుడు జంతువుల్లా పెంచుకుంటున్న వారిని జనాలు తిట్టిపోస్తున్నారు.

Cheetah Slaps man in viral video

ఇంటర్న్‌ట్ డెస్క్: ఆదిమానవుడు రకరకాల అడవి జంతువులను మెల్లమెల్లగా మచ్చిక చేసుకుని పెంపుడు జంతువులుగా మార్చేశాడు. మనం చూసే కుక్కలు, పిల్లులు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు అన్నీ అలా ఉనికిలోకి వచ్చినవే. ఇవి కాక మిగతా క్రూర జంతువుల జోలికి మాత్రం ఆదిమానవడు వెళ్లలేదు. వెళితే చావు తప్పదన్న ఇంగిత జ్ఞానం అతడి స్పీడుకు బ్రేకులు వేసింది. కానీ ఆదిమానవుడి గుణపాఠాలను ఆధునిక మానవుడు మర్చిపోయాడు. సరదా కోసం, డాబు దర్పం కోసం ఏకంగా పులులు, సింహాలకు తాళ్లు కట్టి పెంపుడు కుక్కల్లా వెంట తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి పనులతో ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో తెలిపే వీడియో ప్రస్తుతం వైరల్ (Viral) అవుతోంది.

Viral: గాఢ నిద్రలో కుక్క.. ఏనుగు వస్తున్నా లెక్క చేయలేదు.. చివరకు..


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కొందరు ఏకంగా చీతానే పెంచుకోవడం ప్రారంభించారు. నట్టింట్లో సోఫాపై దాని మెడకు తాడుకట్టి కూర్చోపెట్టారు. ఇద్దరు వ్యక్తులు దానికి ఇరువైపులా కూర్చున్నారు. ఓ వ్యక్తి దాని నెత్తిమీద చేయి వేసి నిమిరే ప్రయత్నం చేశాడు. అప్పటికే చీతాకు ఏం జరుగుతోందో అర్థంకాక తిక్క తిక్కగా ఉంది. దీనికి తోడు అతడు దాని మీద చేయి వేయడంతో అపాయం కలుగుతుందని భ్రమపడి అతడి చెంపపై తన పంజా విసిరింది. దెబ్బ గట్టిగా తగలడంతో అతడు దిమ్మెరపోయాడు. వెంటనే అక్కడి నుంచి లేచి దూరంగా వెళ్లిపోయాడు (Man Trying To Touch Pet Cheetah Receives A Slap In Return).

ఆ తరువాత అక్కడున్న వారికి చీతా పంజాతో ఎక్కడ కొట్టిందీ చూపించాడు. వీడియోలో ఇదంతా చూసిన జనాలు వాళ్లను తిట్టిపోస్తున్నారు. చీతా అతడి పీక కూడా పట్టుకుని ఉండి ఉండే అతడి జీవితం అక్కడే ముగిసిపోయి ఉండేదని కొందరు కామెంట్ చేశారు. క్రూర జంతువులు అడవిలో మాత్రమే ఉండాలని, వీటిని ఇంట్లో పెట్టుకుంటే ఏదోక రోజు చావు తప్పదని హెచ్చరించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, ఇలాంటి వీడియోలు గతంలోనూ వెలుగు చూశాయి. కొందరు పులులకు చెయిన్లు తగిలించి వెంట తిప్పిన వీడియోలపై విమర్శలు వెల్లువెత్తాయి.

Read Viral and Telugu News

Updated Date - May 17 , 2024 | 10:35 PM

Advertising
Advertising