ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఏఐ జమానా అంటే ఇదేనేమో! అలెక్సా కమాండ్‌తో దూసుకుపోయిన దీపావళి రాకెట్!

ABN, Publish Date - Oct 31 , 2024 | 01:22 PM

అలెక్సా కమాండ్‌తో దీపావళి రాకెట్ గాల్లోకి దూసుకుపోయిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసి ఆశ్చర్యపోయిన కొందరు ఏఐ జమానా అంటే ఇదేనేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: దీపావళి నాడు బాణసంచా కాల్చేందుకు అనేక మంది ఉత్సాహం చూపుతారు. ఇంటిల్లపాదీ బయటుకు వచ్చి కాకరపువ్వొత్తులు, చుచ్చుబుడ్డిలు కాలుస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇక నిప్పురవ్వలు చిమ్ముకుంటూ ఆకాశంవైపు దూసుకుపోయే రాకెట్ల గురించి చెప్పుకునేందుకు మాటలు చాలవు. అయితే, కాలంతో పాటు పండుగ జరుపుకునే తీరులో భారీ మార్పులు రాబోతున్నాయా అనే సందేహం కలిగేలా ఓ షాకింగ్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది (Viral).

Viral: భారీ మిస్టేక్! దీపావళి కోసం ఇల్లు శుభ్రం చేస్తుండగా..


ఈ వీడియోలో ఓ వ్యక్తి ఏకంగా అలెక్సా సాయంతో బాణసంచా కాల్చాడు. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, సదరు వ్యక్తి రాకెట్‌ను ఓ ఇనుప బాటిల్‌లో పెట్టాడు. దాన్నుంచి వైర్లను అలెక్సాతో అనుసంధానం చేశాడు. ఆ తరువాత అలెక్సాకు.. ‘రాకెట్ అంటించు’ అని అనగానే అలెక్సా కమాండ్ ఇచ్చేసింది. ఆ మరుక్షణమే ఇనుప బాటిల్‌లోని రాకెట్ నిప్పురవ్వలు ఎగసి పడుతుండగా గాల్లోకి దూసుకుపోయింది. అంటే.. రాకెట్‌ను చేతితో ఏమాత్రం తాకకుండానే గాల్లోకి పంపించేశాడు.

వీడియోలో ఇదంతా చూసిన జనాలు షాకైపోతున్నారు. ఇదెలా సాధ్యమైందని ప్రశ్నిస్తున్నారు. వీడియోకు ఏకంగా 1.5 కోట్ల వ్యూస్ వచ్చాయి. అనేక మంది ఈ ప్రయోగాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అలెక్సాతో ఆ పని ఎలా సాధ్యమైందో పూర్తి వివరాలతో మరో వీడియో చేయాలని అభ్యర్థించారు. మరికొందరేమో.. ఇది నమ్మశక్యంగా లేదని సందేహం కూడా వ్యక్తం చేశారు. ఏఐ జమానా అంటే ఇదేనేమో అని ఇంకొందరు కామెంట్ చేశారు.

Viral: దీపావళి అంటే ఇదీ.. అబ్బుర పరుస్తున్న డ్రోన్ ఫుటేజీ!


అయితే, ఈ కామెంట్లపై స్పందిస్తూ ఓ నెటిజన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆర్డినో మాడ్యుల్ వాడటం ద్వారా ఇలా రాకెట్‌ను అలెక్సా సాయంతో ప్రయోగించొచ్చని అన్నాడు. అలెక్సా వాయిస్ కమాండ్ తీసుకునే ఆర్డినో మాడ్యుల్ మరో రిలే సర్క్యూట్ సాయంతో రాకెట్ లాంచ్ చేయవచ్చని అన్నారు. అలెక్సా నుంచి కమాండ్ అందగానే ఈ మాడ్యుల్‌లోని నిక్రోమ్ వైర్లు వేడెక్కి రాకెట్‌ బత్తీ అంటుకునేలా చేస్తుంది వివరించారు. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఈ విధానం జనాలను విపరీతంగా ఆకట్టుకోవడంతో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Read Latest and Viral News

Updated Date - Oct 31 , 2024 | 01:33 PM