Viral: ఏఐ సాయంతో ఏకంగా షుగర్ వ్యాధినే జయించాడు..
ABN, Publish Date - May 28 , 2024 | 07:26 PM
డయాబెటిస్.. ఒక్కసారి దీని బారినపడ్డామంటే ఇక బయటపడేదే లేదు. అయితే, ఏఐ సాయంతో ఓ వ్యక్తి షుగర్ వ్యాధిని జయించాడు. వ్యాధిని పూర్తి నియంత్రణలోకి తెచ్చుకున్న అతడు తన శరీరంపై వ్యాధి తాలూకు ప్రతికూల ప్రభావాలన్నీ పూర్తిగా తొలగించుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: డయాబెటిస్.. ఒక్కసారి దీని బారినపడ్డామంటే ఇక బయటపడేదే లేదు. అయితే, ఏఐ సాయంతో ఓ వ్యక్తి షుగర్ వ్యాధిని జయించాడు. వ్యాధిని పూర్తి నియంత్రణలోకి తెచ్చుకున్న అతడు తన శరీరంపై వ్యాధి తాలూకు ప్రతికూల ప్రభావాలన్నీ పూర్తిగా తొలగించుకున్నాడు (Health). ప్రతి ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
డెవ్లిన్ డోనల్డ్‌సన్ ఓ ఎన్‌జీవో సంస్థకు సీఈఓ. చాలా కాలంగా అతడు టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నాడు. ఎన్ని మందులు వాడినా ఉపయోగం లేకపోయింది. ఆహార నియమాలు పాటించడంలో అతడి నిర్లక్ష్యం కూడా పరిస్థితిని మరింత దిగజార్చింది. ఇలాంటి పరిస్థితుల్లో అతడు డిజిటల్ ట్విన్ అనే యాప్ వాడటం ప్రారంభించాడు (Man Who Reversed His Diabetes And Lost 18 Kg using digital twin app).
Jaggery: అధిక కొలెస్టెరాల్ ఉన్న వాళ్లు బెల్లం తినొచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..
ఏఐ ఆధారంగా నడిచే ఈ యాప్ డయాబెటిస్ రోగిపై పూర్తి నిఘా పెడుతుంది. రోగి ఆహారం, రక్తంలో చెక్కర స్థాయిలు, కసరత్తుల తీరుతెన్నులు, మందులు, నిద్ర ఇలా అన్ని విషయాలను నిశితంగా గమనించి ఎప్పటికప్పుడు మార్పులు సూచిస్తుంది. రోగుల శరీర తత్వానికి తగినట్టు సూచనలు ఇస్తుంది. డెవ్లిన్‌కు మొదట్లో ఈ యాప్ పై ఎన్నో సందేహాలు ఉన్నప్పటికీ ఓసారి ప్రయత్నిస్తే పోయేదేముంది అనే ఉద్దేశంతో దీన్ని వాడటం ప్రారంభించాడు. కానీ యాప్ సూచనలు యథాతథంగా పాటించడంతో మూడేళ్లల్లో పరిస్థితి పూర్తిగా ఆయన నియంత్రణలోకి వచ్చేసింది. ఈ కాలంలో అతడు ఏకంగా 18 కేజీల బరువు తగ్గాడు.
‘‘మొదట్లో దీన్ని నేను పెద్దగా నమ్మలేదు. సందేహాలతోనే ప్రయాణం ప్రారంభించాను. యాప్‌తో పాటు వచ్చిన బాక్సులోని డిజిటల్ స్కేల్, బీపీ కఫ్, స్మార్ట్ వాచ్, కంటిన్యూయన్ గ్లూకోస్ మానిటర్ వంటివన్నీ యాప్ చెప్పినట్టు ఉపయోగించాను. దీంతో, నా జీవినశైలిని అధ్యయనం చేసిన యాప్ అందుకు అనుగూణంగా మందులు, కసరత్తులు, ఆహార నియమాలను సూచించేది. ఇది తింటే షుగర్ కంట్రోల్ బాగా కంట్రోల్ లో ఉంది చెప్పేది. ఈ ఫుడ్ తింటే షుగర్ పెరిగిందని చెప్పేది. చూస్తుండగానే ఇది నా జీవితంలో ఓ భాగమైపోయింది. నెల తిరిగేసరికల్లా గణీయమైన మార్పు కనిపించింది. భవిష్యత్తులో వైద్య రంగంలో రాబోయే మార్పులకు ఇది ఓ సూచన’’ అని అతడు చెప్పుకొచ్చాడు.
Updated Date - May 28 , 2024 | 07:32 PM