ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: లాటరీ గెలుస్తానని ఫ్రెండ్‌తో చెప్పాడు! ఆ రాత్రే కనకవర్షం!

ABN, Publish Date - Sep 01 , 2024 | 03:22 PM

లైఫ్‌లో అనుకున్నది అరుదుగా మాత్రమే జరుగుతుంది. అమెరికాలోని ఓ వ్యక్తికి సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. లాటరీ గెలుస్తానని స్నేహితుడితో నమ్మకంగా చెప్పిన అతడిపై ఆ రాత్రే కనకవర్షం కురిసింది. ఏకంగా కోటి రూపాయలు గెలుచుకున్నందుకు అతడు ఉబ్బితబ్బిబ్బైపోయాడు.

ఇంటర్నెట్ డెస్క్: లైఫ్‌లో అనుకున్నది అరుదుగా మాత్రమే జరుగుతుంది. అమెరికాలోని ఓ వ్యక్తికి సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. లాటరీ గెలుస్తానని స్నేహితుడితో నమ్మకంగా చెప్పిన అతడిపై ఆ రాత్రే కనకవర్షం కురిసింది (Viral). పూర్తి వివరాల్లోకి వెళితే, ఉత్తర‌ కెరొలీనాకు చెందిన కెమెరూన్ విక్ కొరియర్ సర్వీసులో 37 ఏళ్లుగా పనిచేస్తున్నాడు.

Viral: వామ్మో.. ఇలాంటి ఆటో ఎక్కడా చూడలేదే? మహిళకు ఆశ్చర్యం!


ఇటీవల విక్ ఉత్తర కెరొలీనా ఎడ్యుకేషన్ లాటరీ జాక్‌‌పాట్‌కు చెందిన కాష్‌ 5 టిక్కెట్టును యాప్ ద్వారా కొనుగోలు చేశాడు. అది చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం. అనుకోకుండా లాటరీ టిక్కెట్టు కొనేశాడు. ఆ తరువాత తన స్నేహితుడికి ఈ విషయం చెప్పాడు. అయితే, అతడి అంచనా అనూహ్యంగా నిజమైంది. తాను ఏకంగా కోటి రూపాయల లాటరీ గెలిచినట్టు ఆ రాత్రే తెలిసి అతడు ఉబ్బితబ్బిబ్బైపోయాడు. ‘‘నేను లాటరీ గెలుస్తానని అతడితో డంఖాబజాయించి చెప్పా. అదే చివరకు నిజమైంది’’ అని సంబరపడిపోతూ చెప్పుకొచ్చాడు.


మధ్యతరగతికి చెందిన విక్‌ జీవితాన్ని ఈ లాటరీ రాత్రికి రాత్రి మార్చేసింది. లాటరీ విషయాన్ని తన ఫ్రెండ్‌కు చెప్పగానే అతడు సంబరంతో తనను కౌగిలించుకుని కన్నీరుకార్చాడని అన్నాడు. ఇటీవలే విక్ లాటరీ సంస్థ నుంచి డబ్బులు తీసుకున్నాడు. పన్నులు పోను అతడికి రూ.96,42,406 దక్కింది. ఈ మొత్తంతో తన ఇల్లు రిపేర్ చేయించుకుంటానని అతడు చెప్పుకొచ్చాడు.

కాగా, ఉత్తరకెరొలీనాలో మొత్తం ఆరు లాటరీ గేమ్స్ ఉన్నాయి. కస్టమర్లు వెబ్‌సైట్, యాప్‌ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. లేదా పాత పద్ధతిలో ఏదైనా షాపులో వాటిని కొనుగోలు చేయొచ్చు. ఇక మంగళవారం నాటి టాప్ ప్రైజ్ రూ.1,97,98,051ను మరో వ్యక్తి గెలుచుకున్నాడు.

Read Latest and Viral News

Updated Date - Sep 01 , 2024 | 03:29 PM

Advertising
Advertising