Viral: పొట్టపై సాలీడు కుడితే ఇంత ప్రమాదమా! ఇతడికి ఏమైందో తెలిస్తే..
ABN, Publish Date - Sep 16 , 2024 | 08:32 PM
సాలీడు కుట్టడంతో ఓ వ్యక్తి పొట్టపై దద్దురు లేచింది. చూస్తుండగానే ఆ భాగంలో కండ కుళ్లిపోయి రాలిపోయింది. క్రమంగా రంధ్రం పెద్దదైంది. సాలీడు కారణంగా అరుదైన ఇన్ఫెక్షన్ బారినపడ్డట్టు గుర్తించి వైద్యలు తగిన చికిత్స చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: మనకు సాధారణంగా ఇళ్లల్లో కనిపించే సాలీళ్లు విషపూరితమైనవి కావు. అవి కుట్టినా వచ్చే ప్రమాదం ఏమీ ఉండదు. అయితే, బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తికి ఊహించని ప్రమాదం ఎదురైంది. సాలీడు కుట్టడంతో ప్రమాదంలో పడ్డ అతడికి చావు తప్పి కన్నులొట్టపోయినట్టైంది. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది.
Viral: తల్లి ఇంట్లో లేకపోతే ఇంతే.. పిల్లలను రిస్క్‌లో పడేసిన తండ్రి!
బ్రిటన్‌కు చెందిన 59 ఏళ్ల నైజెల్ హంట్ ఇటీవల విహారయాత్ర కోసం సిసిలీకి వెళ్లి ఊహించని ప్రమాదంలో పడ్డాడు. అక్కడ ఉండగా ఓ రోజు రాత్రి చిన్న సాలీడు అతడి పొట్టపై కుట్టింది. నొప్పి పెద్దగా లేకపోవడంతో అతడు ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయాడు. ఒంటిపై ఉన్న సాలీడును కిందకు దులిపి తన పనిలో నిమగ్నమైపోయాడు (Mans flesh starts to rot off after deadly spider bite creates a giant hole in his stomach ).
Viral: అప్పులోళ్లకు రైతు బిడ్డ షాక్! లోన్ కట్టలేదని ట్రాక్టర్ తీసుకెళుతుంటే..
ఆ మరుసటి రోజు నుంచి పొట్టపై దద్దురు వచ్చింది. దురద కూడా మొదలైంది. ఇది కూడా పెద్దగా ఇబ్బంది పెట్టకపోవడంతో అతడు పెద్దగా పట్టించుకోలేదు. కానీ, కొన్ని రోజులకు పరిస్థితి దారుణ మలుపు తిరిగింది. పొట్టపై పుండు ఉన్న చోట పెద్ద రంధ్రం ఏర్పడి కుళ్లిపోయిన కండ ముక్కలు ముక్కలుగా జారి కిందపడిపోయింది, రాను రాను రంధ్ర పెద్దది కాసాగింది.
Viral: రోజూ స్నానం చేయని భర్త! విసుగెత్తిపోయిన భార్య ఏం చేసిందంటే..
దీంతో, కంగారు పడిపోయిన అతడు వైద్యులను సంప్రదించారు. అతడికి వివిధ రకాల పరీక్షలు చేసిన వైద్యులు రోగి నెక్రొటైసింగ్ ఫాసైటిస్‌తో బాధపడుతున్నట్టు గుర్తించారు. దీన్ని సాధారణ భాషలో ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్ అని అంటారు. గాయమైన చోట బ్యాక్టీరియా చేరి విషపూరిత పదార్థాలను విడుదల చేస్తూ చుట్టూ ఉన్న కండ కుళ్లిపోయేలా చేస్తాయి. ఇలా కుళ్లిపోయిన కణాలు రాలి కింద పడిపోవడంతో పెద్ద రంధ్రం ఏర్పడుతుంది.
Sunita Williams: అంతరిక్షం నుంచి ఓటు వేయనున్న సునీతా విలియమ్స్! ఇదెలా సాధ్యమంటే..
పరిస్థితిని చక్కదిద్దేందుకు వైద్యులు రంధ్రం ఉన్న చోట కొంత కండను తొలగించి బాక్టీరియా పీడ విరగడయ్యేలా చేశారు. సరైన సమయంలో వైద్యం అందకపోయి ఉండే అతడు మరణించి ఉండేవాడని వైద్యులు అన్నారు.
Viral: ఈ రక్తం ధర లీటరుకు రూ.12 లక్షలు! ఇంత ఖరీదు ఎందుకో తెలిస్తే..
Viral: విమానం ఎంట్రీ డోర్స్ ఎడమ వైపే ఎందుకుంటాయో తెలుసా?
Updated Date - Sep 16 , 2024 | 08:47 PM