Viral: చేతి కుస్తీ పోటీలు! పుల్లలా విరిగిన చేయి! ఒళ్లు గగుర్పొడిచే వీడియో!
ABN, Publish Date - Dec 05 , 2024 | 12:14 PM
చేతి కుస్తీ పోటీల్లో పాల్గొని అనూహ్యంగా చేయి విరగొట్టుకున్న ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. జనాలు నోరెళ్లబెట్టేలా చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: దేహ దారుఢ్యాన్ని పరీక్షించుకునేందుకు కుస్తీ పోటీలకు మించినవి లేవు. వీటిల్లో ఆర్మ్ రెజ్లింగ్.. అంటే చేతి కుస్తీలు చాలా ప్రత్యేకమైనవి. కాస్తంత కండ పుష్టి ఉన్న వారెవరైనా సరే పెద్దగా ట్రెయినింగ్ లాంటివేవీ తీసుకోకుండానే తమ టాలెంట్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు. కానీ, ఇలాంటి పోటీల్లో కూడా అనూహ్య ఘటనలు జరుగుతాయని చెప్పే వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. ఈ పోటీలో పాల్గొన్న ఓ వ్యక్తి చేయి అనూహ్యంగా ఎలా విరిగిపోయిందో చూసి జనాలు షాకైపోతున్నారు.
Viral: దొంగలున్నారో లేదో తెలుసుకునేందుకు యువతి ప్రయోగం.. షాకింగ్ వీడియో!
వీడియో మొదట్లో ఇద్దరూ వ్యక్తులూ తగ్గాఫోరుగా పోటీపడ్డారు. వెనక్కి తగ్గేదే లేదన్నట్టు తమ కండల బలాన్ని ప్రదర్శించారు. చుట్టూ ఉన్న వారు ఉత్కంఠగా చూడసాగారు. గెలుపు ఎవరిని వరిస్తుందో ఎవరికీ కొన్ని క్షణాల పాటు అర్థంకాలేదు. ఇంతలో ఓ వ్యక్తి తన శక్తినంతా కూడదీసుకుని అవతలి వ్యక్తి చేయిని కిందకు నెట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రెండో వ్యక్తి కూడా ఆ ప్రయత్నాన్ని తన శక్తిమేరకు అడ్డుకున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో అనూహ్య ప్రమాదం చోటుచేసుకుంది. ఏదో విరిగినట్టు ఓ శబ్దం రావడం.. ఆ వెంటనే చేయి విరిగిపోవడం చకచకా జరిగిపోయాయి. వెంటనే మొదటి వ్యక్తి ఆ చేయిని వదిలిపెట్టగా రెండో వ్యక్తి నొప్పితో గిలగిల్లాడుతూ తన చేయిన టక్కున వెనక్కు తీసుకున్నాడు. చుట్టూ ఉన్న వారు కూడా ఈ సీన్ చూసి షాకైపోయారు.
Viral: బిస్కెట్లల్లో రంధ్రాలు ఎందుకుంటాయో తెలుసా?
ప్రస్తుతం వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. లక్షల కొద్దీ వ్యూస్ వచ్చిపడుతున్నాయి. జనాలు కుప్పలుతెప్పలుగా కామెంట్ చేశారు. ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జరిగిందని చెప్పారు వీడియోలోని దృశ్యాలు చూసి అనేక మంది నోరెళ్లబెట్టారు. ఇలాక్కూడా జరుగుతుందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గాయపడ్డ వ్యక్తి తీరును కొందరు ప్రశ్నించారు. తన దేహదారుఢ్యం ఎంత ఉందో తెలుసుకోకుండా ఎలా పోటీలో దిగాడని అన్నారు. చేయి విరిగిందా లేక డిస్‌లొకేట్ అయ్యిందా అని కొందరు ప్రశ్నించారు. వీడియో మాత్రం భయానకంగా ఉందని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది. మరి ఈ షాకింగ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి!
Viral: సూపర్ మార్కెట్లో బాలిక రచ్చ.. షాకింగ్ వీడియో వైరల్
Anand Mahindra: దటీజ్ ఆనంద్ మహీంద్రా! చెడామడా విమర్శించిన నెటిజన్‌కు స్వీట్ సర్‌ప్రైజ్
Updated Date - Dec 05 , 2024 | 12:23 PM