ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఈ సంస్థలో ఉద్యోగులందరికీ ఏకంగా 9 రోజుల లీవ్! రిలాక్స్ అయ్యేందుకట!

ABN, Publish Date - Oct 12 , 2024 | 07:24 AM

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆఫీసు విధుల గురించి మర్చిపోయి ఫుల్లుగా ఎంజాయ్ చేసి రావాలంటూ ఉద్యోగులకు ఏకంగా తొమ్మిది రోజుల లీవ్ మంజూరు చేసింది.

Holidays

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆఫీసు విధుల గురించి మర్చిపోయి ఫుల్లుగా ఎంజాయ్ చేసి రావాలంటూ ఉద్యోగులకు ఏకంగా తొమ్మిది రోజుల లీవ్ మంజూరు చేసింది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 3 వరకూ వారికి ఈ సెలవులు ఇచ్చింది. నిత్యం పని ఒత్తిడులతో మునిగితేలే ఉద్యోగులు సేదతీరేందుకు మళ్లీ నూతనోత్సాహంతో విధులు ప్రారంభించేందుకు ఈ సెలవులు ఇస్తున్నట్టు పేర్కొంది (Viral).

Viral: ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై శృతి హాసన్ ఆగ్రహం!


రీసెట్ అండ్ రీచార్జ్ పేరిట మీషో ఈ సెలవులను ఇవ్వడం వరుసగా ఇది నాలుగో ఏడాది. ఈ సెలవు రోజుల్లో ఉద్యోగులకు సంస్థ నుంచి పని సంబంధిత ఈమెయిల్స్ ఫోన్ కాల్స్ వంటివేవీ రావు. కనీసం మెసేజీలు కూడా ఉండవు. మీటింగ్స్ అసలే ఉండవు. ఉద్యోగుల తమ ఆఫీసు గురించి పూర్తిగా మర్చిపోయే కుటుంబంతో హ్యాపీగా గడిపేందుకు, తమని తాము నూతనోత్సాహంతో రీచార్జ్ చేసుకునేందుకు ఈ సెలవులు ప్రకటించింది.

‘‘మీ అందరి కృషి వల్ల ఈ ఏడాది కంపెనీకి అద్భుతంగా గడిచింది. మెగా బ్లాక్‌బస్టర్ సేల్ కూడా పూర్తి చేసుకున్నాం. ఇక కొన్ని రోజులు ఆఫీసు గురించి మర్చిపోయే సేద తీరే టైం వచ్చేసింది. మనసు, శరీరాన్ని రీచార్జ్ చేసుకోవాలి. వచ్చే ఏడాది కొత్త మరింత ఉత్సాహంతో ప్రారంభించాలి’’ అని కంపెనీ ఓ పోస్టులో పేర్కొంది.

Viral: ఒంటరిగా స్లమ్ ఏరియాకు వెళ్లిన ఫారినర్! అతడిని స్థానికులు చూసి..


ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ ఇన్ని సెలవులు ప్రకటించిన మీషోపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. కంపెనీ నిర్ణయాన్ని అనేక మంది మెచ్చుకున్నారు. ‘‘నేటి జమానాలో నిత్యం పనిలో మునిగితేలుతూ గడిపేయడం సాధారణమైపోయింది. అయితే, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇస్తూ ఉద్యోగులకు ఏకంగా 9 రోజుల సెలవులు మంజూరు చేయడం నిజంగా గొప్ప విషయం’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఉద్యోగులపై మోయలేని పనిభారం మోపే సంస్థలున్న నేటి తరుణంలో మీషో మంచి సంప్రదాయాన్ని కొనసాగిస్తోందని మరో నెటిజన్ అన్నాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం వైరల్ అవుతోంది.

Viral: విమానం నడుపుతన్న భర్తకు గుండెపోటు! ఒంటరైన భార్య ఊహించని విధంగా..

Read Latest and Viral News

Updated Date - Oct 12 , 2024 | 10:37 AM