Microsoft Engineer: లక్షల్లో సంపాదించే మైక్రోసాఫ్ట్ ఇంజినీర్.. వారాంతంలో ఎందుకు ఆటో నడుపుతున్నాడంటే..
ABN, Publish Date - Jul 23 , 2024 | 10:18 AM
మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థంలో ఉద్యోగం అంటే మామూలుగా ఉండదు. డబ్బుకు లోటుండదు. ఏ సౌకర్యానికి కొదవ ఉండదు. మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు.. ఐటీ ఉద్యోగాలు చేసే చాలా మంది లక్షల్లో సంపాదిస్తుంటారు. అయితే వారి బిజీ జీవితంలో ప్రశాంతంగా గడపడానికి మాత్రం టైమ్ ఉండదు.
మైక్రోసాఫ్ట్ (Microsoft) వంటి దిగ్గజ సంస్థంలో ఉద్యోగం అంటే మామూలుగా ఉండదు. డబ్బుకు లోటుండదు. ఏ సౌకర్యానికి కొదవ ఉండదు. మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు.. ఐటీ ఉద్యోగాలు చేసే చాలా మంది లక్షల్లో సంపాదిస్తుంటారు. అయితే వారి బిజీ జీవితంలో ప్రశాంతంగా గడపడానికి మాత్రం టైమ్ ఉండదు. చాలా మందికి ఒంటరితనం అనేది పెద్ద సమస్యగా మారింది. ఆ ఒంటరితనాన్ని వదిలించుకునేందుకు బెంగళూరుకు చెందిన ఓ మైక్రోసాఫ్ట్ ఉద్యోగి (Microsoft Engineer) వినూత్నమైన రూటు ఎంచుకున్నాడు (Viral News).
వెంకటేష్ గుప్తా అనే ట్విటర్ యూజర్ బెంగళూరు (Bengaluru)లోని కోరమంగళలో ఆటో (Auto) బుక్ చేసుకున్నాడు. ఆటో ఎక్కిన వెంకటేష్‌కు షాక్ తగిలింది. ఆటో డ్రైవర్ మైక్రోసాఫ్ట్ లోగో ఉన్న హుడీ ధరించాడు. మెల్లిగా అతడితో మాటలు కలపగా అసలు విషయం బయటపడింది. తాను మైక్రోసాఫ్ట్‌లో ఇంజినీర్‌నని, ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి వారాంతంలో అలా ఆటో నడుపుతుంటానని ఆ వ్యక్తి చెప్పాడట. అపరిచితులతో మాట్లాడుతూ తనలోని ఒంటరితనాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపాడట.
సాధారణంగా బెంగళూరులో ఐటీ ఉద్యోగాలు చేసే చాలా మంది ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దూరంగా బెంగళూరులో ఒంటరిగా గడుపుతుంటారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``బెంగళూరులో ఆటో నడుపుకున్నా చాలా డబ్బులు సంపాదించవచ్చు``, ``నారాయణమూర్తి సలహాను పాటిస్తున్నారా బ్రదర్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: ఈ పజిల్ స్వాల్ చేయడానికి 5 సెకెన్లు చాలు.. ఈ ``9``ల మధ్య ఉన్న ``4``ను వెతకండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 23 , 2024 | 10:18 AM