Share News

Mixer Grinder vs Blender: మిక్సర్ గ్రైండర్ vs బ్లెండర్.. వీటి మధ్య తేడాలేంటో తెలుసా?

ABN , Publish Date - Apr 13 , 2024 | 11:17 AM

మిక్సర్ గ్రైండర్, బ్లెండర్ లను ఎంతో బాగా ఉపయోగించేవారికి కూడా వాటి మధ్య తేడాలేంటో తెలుసుండదు.

Mixer Grinder vs Blender: మిక్సర్ గ్రైండర్ vs బ్లెండర్.. వీటి మధ్య తేడాలేంటో తెలుసా?

ఇప్పటికాలం వంటగదిలో గ్యాస్ స్టౌ, మిక్సీ వంటివి తప్పనిసరిగా ఉంటాయి. పిండి రుబ్బుకోవడం నుండి కారం పొడులు, చట్నీలు, వంట కోసం మసాలాలు, జ్యూస్ లు.. ఇలా ఒకటనేమిటి? అన్నింటికి ఇంట్లో మిక్సర్ గ్రైండర్లు, బ్లెండర్లు వాడటం పరిపాటి. అయితే మిక్సర్ గ్రైండర్, బ్లెండర్ లను ఎంతో బాగా ఉపయోగించేవారికి కూడా వాటి మధ్య తేడాలేంటో తెలుసుండదు. అసలు మిక్సర్ గ్రైండర్, బ్లెండర్ మధ్య తేడాలేంటి? తెలుసుకుంటే..

మిక్సర్ గ్రైండర్..

మిక్సర్ గ్రైండర్ ప్రధానంగా మసాలా దినుసులు గింజలు, కాయలు, కాయధాన్యాలు వంటివి పొడి పదార్థాలుగా చేయడానికి, గ్రైండింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. గ్రైండర్ జార్‌లో దృఢమైన, కఠినమైన బ్లేడ్‌లు ఉంటాయి. ఇవి కొన్ని నిమిషాల్లో మెత్తని పొడిని తయారు చేయడంలో సహాయపడతాయి.

మిక్సర్ గ్రైండర్ బ్లేడ్స్ డిజైన్ వేరుగా ఉంటాయి. వీటి చుట్టూ పదును ఉంటుంది. ఇది దినుసులను మెత్తగా పొడి చేయడంలో సహాయపడుతుంది.

గ్రైండర్లు భారతీయ వంటలకు అత్యుత్తమమైనవి. వీటిని నిర్దేశించిన పనులకు మాత్రమే ఉపయోగిస్తే సమస్య ఉండదు. కానీ గ్రైండర్లను బ్లెండర్ల స్థానంలో వాడితే ఇబ్బందులు తప్పవు.

గ్రైండర్లలో ఉండే మోటార్ శక్తివంతమైనది. గట్టి పదార్థాలను కూడా సులభంగా గ్రైండ్ చేయడం కోసం దీన్ని రూపొందించి ఉంటారు.

ఇది కూడా చదవండి: విటమిన్-బి12 పుష్కలంగా ఉన్న పండ్లు కూరగాయల గురించి తెలుసా?


బ్లెండర్..

బ్లెండర్స్ ను స్మూతీలు, షేక్స్, సూప్ లు, సాస్ లు, ప్యూరీలను తయారుచేయడానికి ఉపయోగిస్తారు. వీటిలో బ్లేడ్లు పండ్లు, కూరగాయలను మృదువుగా, సులభంగా గుజ్జు చేయడంలో అనువుగా ఉంటాయి.

బ్లెండర్ బ్లేడ్ లు వోర్టెక్స్‌ను రూపొందించడానికి రూపొందించబడ్డాయి. ఇవి కలపడం, మెత్తగా చేయడం, నుండి మంచును అయినా, పండ్లను అయినా సులువుగా బ్లెండ్ చేస్తాయి.

బ్లెండర్లలో సాధారణంగా ద్రవ పదార్థాలు వేస్తారు. ఇవి లీక్ కాకుండా తయారుచేయబడతాయి. అయితే వీటిని వాడేటప్పుడు మూతలు సరిగ్గా వేశామా లేదా అనే విషయం గమనించుకోవాలి. లేకపోతే లిక్విడ్స్ పైకి చిమ్మడం లేదా లీక్ కావడం వల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.

బ్లెండర్లలో కూడా మోటార్ శక్తివంతంగా ఉంటుంది. మంచును సైతం పిండిగా చేయగలవివి.

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 13 , 2024 | 11:17 AM