ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: భయపెట్టాలని చూసిన కోతి.. అయినా చలించని వ్యక్తి.. చివరకు ఏమైందో మీరే చూడండి..

ABN, Publish Date - Jan 30 , 2024 | 03:19 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఏ పనులు చేస్తున్న వారైనా.. రీల్స్ చేయడం మాత్రం కామన్‌గా మారిపోయింది. కొందరైతే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ ప్రతి ఘటననూ ఫొటోలు, వీడియోలు రూపంలో నెట్టింట వదులుతుంటారు. వీటిలో...

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఏ పనులు చేస్తున్న వారైనా.. రీల్స్ చేయడం మాత్రం కామన్‌గా మారిపోయింది. కొందరైతే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ ప్రతి ఘటననూ ఫొటోలు, వీడియోలు రూపంలో నెట్టింట వదులుతుంటారు. వీటిలో కొన్ని వీడియోలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పర్యాకుడిని భయపెట్టాలని చూసిన కోతి.. అతడి వీడియోల పిచ్చి ముందు ఓడిపోయింది. చివరకు ఏం జరిగిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పర్యాకులంతా ఓ ప్రాంతంలో కొండపై అందాలను వీక్షిస్తుంటారు. ఈ క్రమంలో కోతులు కూడా అక్కడికి చేరుకుని, వారు ఇచ్చే ఆహార పదార్థాల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఓ కోతి ఓ అడుగు ముందుకేసింది. ‘‘ఎంత సేపు ఎదురుచూడాలి.. భయపెడితే గానీ మాట వినరు’’.. అని అనుకుందో ఏమో గానీ.. వెంటనే ఓ వ్యక్తి వద్దకు వెళ్లింది. అప్పటికే అతను కొండ చివరన నిలబడి రీల్స్ కోసం వీడియోలు (Reels videos) తీసుకుంటూ ఉన్నాడు. అతడి వద్దకు వెళ్లిన కోతి (monkey) .. అతడి చేయి కొరుకుతూ భయపెట్టాలని చూస్తుంది.

Viral Video: రోజూ హెల్మెట్ వాడుతుంటారా.. ఈ వీడియో చూశారంటే.. ఖంగుతింటారు..

అయినా అతను మాత్రం రీల్స్ కోసం కోతే మన దగ్గరికి వచ్చింది... అని అనుకుంటూ కెమెరాకు వివిధ రకాలుగా ఫోజులు ఇస్తుంటాడు. ఎంత భయపెట్టినా.. అతను కొంచెం కూడా చలించకపోవడంతో కోతికి ఆశ్చర్యం కలుగుతుంది. ‘‘నువ్వేంట్రా.. ఇంతలా భయపెడుతున్నా.. కొంచెం కూడా భయపడలేదు’’.. అని అవాక్కవుతూ చూస్తుండిపోతుంది. అయినా అతడు మాత్రం వీడియోల పిచ్చిలోనే ఉంటాడు. దీంతో చివరకు అలసిపోయిన కోతి.. అతడి చేయి పట్టుకుని.. ‘‘కొంచెమైనా భయపడురా.. నాయనా’’.. అన్నట్లుగా బ్రతిమాలుకుంటుంది. అయినా అతడిలో మాత్రం ఎలాంటి స్పందనా రాదు. దీంతో చివరకు విరక్తిచెందిన కోతి.. రాయిపై తలపెట్టి పడుకుంటుంది. చివరకు అతను కోతి బాధ అర్థం చేసుకుని చేత్తో నిమురుతూ ఓదారుస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 13లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral: ఇంటికి వెళ్తూ తమలపాకులు తినాలన్న కోరిక.. అతడి నేరాలన్నింటినీ బయట పెట్టింది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

Updated Date - Jan 30 , 2024 | 03:19 PM

Advertising
Advertising