ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: వధువు తల్లి, వరుడి తండ్రికి మధ్య ప్రేమ.. పెళ్లికి ముందే ఇంట్లోంచి పరార్!

ABN, Publish Date - Jul 16 , 2024 | 09:42 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వధువు తల్లి, వరుడి తండ్రి ప్రేమలో పడి చివరకు తమ బిడ్డల పెళ్లికి ముందే ఇంట్లోంచి పారిపోయారు.

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వధువు తల్లి, వరుడి తండ్రి ప్రేమలో పడి చివరకు తమ బిడ్డల పెళ్లికి ముందే ఇంట్లోంచి పారిపోయారు. విషయం తెలిసి షాకైన వధువు తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. జూన్ 5న వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా (Viral) మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే, కస్గంజ్ ప్రాంతానికి చెందిన వధువు తండ్రి, వరుడి తండ్రికి మధ్య కొన్నేళ్లుగా పరిచయం ఉంది. పది మంది పిల్లలున్న వరుడి తండ్రి ఆటో తోలుతూ ఉంటాడు. నిత్యం తన స్నేహితుడికి ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. వధువు తండ్రికి కూడా ఆరుగురు పిల్లలున్నారు (Mother Of 6 Elopes With Father Of 10 Kids Days Ahead Of Their Childrens Wedding In UPs Kasganj).

Viral: కొండముచ్చు ఎంత పని చేసింది.. బాలిక వెనక నుంచి సడెన్‌గా.. షాకింగ్ వీడియో!


ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ రోజు స్నేహితులిద్దరు తమ బంధాన్ని వియ్యంతో బంధుత్వంగా మార్చుకుందామనుకున్నారు. జులై 17న తమ సంతానానికి పెళ్లి చేద్దామనుకున్నారు. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు మరింత పెరిగాయి. వరుడి తండ్రి నిత్యం వధువు ఇంటికి వచ్చి వెళ్లే క్రమంలో ఆమె తల్లితో (35) పరిచయం పెరిగి ప్రేమగా మారింది. చివరకు జూన్ 5న ఇద్దరు ఇంట్లోంచి వెళ్లిపోయారు.

తన భార్య కనిపించకపోవడంతో చాలా చోట్ల వెతికిన వధువు తండ్రి చివరకు పోలీసులను ఆశ్రయించాడు. స్థానిక పోలీసులు వెతికినా ఫలితం లేకపోవడంతో అతడు జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు. ఆయన సూచన మేరకు ఎఫ్‌ఐర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read Viral and Telugu News

Updated Date - Jul 16 , 2024 | 10:07 PM

Advertising
Advertising
<