Viral Video: పామును చూడగానే పారిపోయే ఎలుక.. ఏకంగా యుద్ధానికే దిగింది.. కారణం తెలిస్తే.. గుండె తరుక్కుపోతుంది..
ABN, Publish Date - Jan 12 , 2024 | 03:54 PM
పాములను చూడగానే ఎవరైనా భయపడి పారిపోవడం సర్వసాధారణం. అలాంటిది ఎలుకలు పారిపోవడంలో పెద్ద విశేషమేమీ లేదు. ఎలుకలను చూడగానే పాములు ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాడి చేసి చంపేస్తుంటాయి. అలాగే...
పాములను చూడగానే ఎవరైనా భయపడి పారిపోవడం సర్వసాధారణం. అలాంటిది ఎలుకలు పారిపోవడంలో పెద్ద విశేషమేమీ లేదు. ఎలుకలను చూడగానే పాములు ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాడి చేసి చంపేస్తుంటాయి. అలాగే ఎలుకలు కూడా పాములు కనిపిస్తే పారిపోవడమో, లేక వాటికి ఆహారమవడమో జరుగుతుంటుంది. అయితే కొన్నిసార్లు ఇందుకు విరుద్ధంగా కూడా జరుగుతుంటుంది. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పామును చూడగానే పారిపోవాల్సిన ఎలుక.. అందుకు విరుద్ధంగా పాముపైకే యుద్ధానికి దిగింది. అందుకు గల కారణం తెలుసుకుని నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు.
తల్లి ప్రేమ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమ పిల్లల సంక్షేమం అవసరమైతే తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టగలిగేంత ప్రేమ ఉంటుంది కాబట్టే.. తల్లిని మించిన దైవం లేదు.. అని అంటూ ఉంటాం. తల్లి ప్రేమ మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా ఒకేలా ఉంటుంది. తాజాగా, వైరల్ అవుతున్న వీడియోనే (Viral Video) ఇందుకు నిదర్శనం. ఓ పాము (Snake attack on rat) ఎలుక పిల్లపై దాడి చేస్తుంది. దాన్ని చంపేసే సమయంలో తల్లి ఎలుక గమనిస్తుంది. పామును చూడగానే భయంతో పారిపోవాల్సిన ఎలుక.. తన పిల్లను కాపాడుకునేందుకు ప్రాణాలకు తెగించి (rat fight with snake) పాముతోనే సమరానికి దిగింది. పిల్ల ఎలుకను చుట్టేసిన పాము వద్దకు వెళ్లి.. ‘‘నా పిల్లను వదులుతావా... లేదా కొరికేసి చంపేయమంటావా’’.. అన్నట్లుగా ఆవేశంగా చూస్తూ సమీపానికి వెళ్తుంది.
Viral Video: ఎవర్రా దీనికి ట్రైనింగ్ ఇచ్చిందీ... ఒలంపిక్స్‌కి పంపిస్తే గోల్డ్ మెడల్ ఖాయం..
ఎలుక సమీపానికి రాగానే పాము కాటేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే పాము కాటు నుంచి చాకచక్యంగా తప్పించుకుంటూ తన పిల్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో పామును అటూ, ఇటూ తిప్పుతూ తికమకపెడుతుంది. దీంతో చివరకు ఎలుక పిల్ల పాము వద్ద నుంచి కాస్త దూరంగా జరుగుతుంది. పాము అటు వైపు చూస్తుండగా.. మెల్లగా సమీపానికి వెళ్లి తన పిల్లను నోట కరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇలా చివరకు తన పిల్ల ప్రాణాలను కాపాడుకుని తల్లి ప్రేమ అంటే చాటిచెప్పింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘తల్లి ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూ కొందరు, ‘‘తన పిల్ల కోసం ప్రాణాలు ఫణంగా పెట్టడం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - Jan 12 , 2024 | 03:54 PM