Mukesh Ambani: ముఖేష్ అంబానీ గురించి చాలామందికి తెలియని నిజాలివీ..!
ABN, Publish Date - Mar 26 , 2024 | 11:16 AM
ముఖేష్ అంబానీ వ్యాపార దిగ్గజంగా మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఆయన విద్యా నేపథ్యం గురించి తెలిస్తే మాత్రం షాకవుతారు.
భారతీయ కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన ముఖేష్ అంబానీ వ్యాపార దిగ్గజంగా మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఆయన విద్యా నేపథ్యం గురించి తెలిస్తే మాత్రం షాకవుతారు. $114 బిలియన్ల నికర విలువతో ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచిన ముఖేష్ అంబానీ విజయం వెనుక అతని విద్యా నేపథ్యం కూడా ప్రముఖ పాత్ర పోషించింది. చాలామందికి తెలియని ముఖేష్ అంబానీ విద్యా విషయాల గురించి తెలుసుకుంటే..
తొలినాళ్లలోనే..
ముఖేష్ అంబానీ యెమెన్ లోని అడెన్ లో జన్మించారు. పాఠశాల ప్రారంభం మొదట్లో అక్కడే గడిచింది. ఆ తరువాత భారతదేశానికి తిరిగివచ్చిన తరువాత ముంబైలోని పెద్దర్ రోడ్ లో ఉన్న హిల్ గ్రాంజ్ హైస్కూల్ లో విద్యాభ్యాసం కొనసాగింది. ఆ స్కూల్లోనే వర్క్ ఈజ్ వర్షిప్ అనే సిద్దాంతాన్ని అలవర్చుకున్నారు. అదే ఆయనలో శ్రద్ద, పట్టుదల, విలువలను పెంచింది.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో తప్పక తినాల్సిన స్ట్రీట్ ఫుడ్స్ లిస్ట్ ఇదీ..!
పాఠశాల విద్య తరువాత ముంబైలోని సెయింట్ జేవియర్స్ కళాశాలలో చేరాడు. ఈ కళాశాలలో కెమికల్ ఇంజరీంగ్ సూత్రాలలో ముఖేష్ అంబానీ పట్టు సాధించాడు. ఇదే రియలన్స్ ఇండస్ట్రీన్ పెట్రోకెమికల్ వెంచర్ లను పర్యవేక్షించడానికి, పెట్రోకెమికల్ రంగంలో రియలన్స్ ను ప్రపంచ పవర్ హౌస్ గా మార్చడంలోనూ దోహదం చేసింది.
స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం..
ప్రతిష్టాత్మక సంస్థ అయిన స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ముఖేష్ అంబానీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్& మేనేజ్మెంట్ చేశాడు. 1980లో తండ్రికి చేదోడుగా వ్యాపారరంగంలో అడుగుపెట్టాడు. తను కళాశాలల్లో నేర్చుకున్న విషయాలను వ్యాపారంలో అమలుపరిచాడు. అది రిలయన్స్ ఇండస్ట్రీస్ ను సాధారణ సంస్థ నుండి భారతదేశంలో అతిపెద్ద విజయవంతమైన సంస్థలలో ఒకటిగా మార్చేసింది.
మరిన్ని ప్రత్యేక వార్తలకోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Mar 26 , 2024 | 11:16 AM