Viral Video: క్యాబ్ ఆపమని ఆమె చేసిన పనికి డ్రైవర్ షాక్.. వెంటనే ఎలా కాపాడాడంటే.. వీడియో వైరల్!
ABN , Publish Date - Aug 17 , 2024 | 10:33 AM
ముంబైకి చెందిన ఆ మహిళ క్యాబ్ బుక్ చేసుకుంది.. అటల్ సేతు వద్దకు వెళ్లింది.. ఆమె ఎంత బాధలో ఉందో ఎమో.. బ్రిడ్జ్‌పై క్యాబ్ ఆపమని చెప్పింది.. క్యాబ్ దిగి వంతెన పైకి ఎక్కి నీళ్లలోకి దూకాలనుకుంది.. సకాలంలో వచ్చిన డ్రైవర్ ఆమె జట్టు పట్టుకుని ఆపాడు.
ముంబై (Mumbai)కి చెందిన ఆ మహిళ క్యాబ్ (Cab) బుక్ చేసుకుంది.. అటల్ సేతు (Atal Setu) వద్దకు వెళ్లింది.. ఆమె ఎంత బాధలో ఉందో ఎమో.. బ్రిడ్జ్‌పై క్యాబ్ ఆపమని చెప్పింది.. క్యాబ్ దిగి వంతెన పైకి ఎక్కి నీళ్లలోకి దూకాలనుకుంది.. సకాలంలో వచ్చిన డ్రైవర్ (Cab driver) ఆమె జట్టు పట్టుకుని ఆపాడు.. సీసీ ఫుటేజ్ ద్వారా పరిస్థితిని గమనించిన కంట్రోల్ రూమ్ పోలీసులు (Police) పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.. వారు అక్కడకు చేరుకుని ఆ యువతికి నచ్చ చెప్పి ప్రాణాలు కాపాడారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
ముంబైలోని ములుండ్ ప్రాంతంలో నివసిస్తున్న 56 ఏళ్ల రీమా పాటిల్ శుక్రవారం నాడు క్యాబ్ బుక్ చేసుకుంది. అటల్ సేతు వద్ద క్యాబ్ ఆపాలని అడిగింది. అక్కడ క్యాబ్ దిగి రెయిలింగ్ వద్దకు చేరుకుంది. ఆమె చేస్తోంది ఏంటో అర్థం చేసుకుని అప్రమత్తమైన డ్రైవర్ ఆమె జుట్టు పట్టుకుని ఆపాడు. అటల్ సేతు వద్ద పరిస్థితిని సీసీటీవీ ద్వారా పర్యవేక్షిస్తున్న కంట్రోల్ రూమ్ పోలీసులు పెట్రోలింగ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు ఆమెను రక్షించారు.
అయితే తాను ఆత్మహత్యాయత్నం చేయలేదని, తమ ఆచారం ప్రకారం దేవుళ్ల ఫొటోలను నదిలో నిమజ్జనం చేస్తున్నట్టు చెప్పింది. ముందుగా ఐరోలి బ్రిడ్జ్ వద్దకు వెళ్లానని, అయితే అక్కడ నీళ్లు లోతుగా లేకపోవడంతో అటల్ సేతు వద్దకు వచ్చానని చెప్పింది. అటల్ సేతు వంతెనపైకి వెళ్లి రైలింగ్ పైకి ఎక్కి ఫోటోలను ఒక్కొక్కటిగా విసురుతున్నానని, ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసుల జీపు శబ్దం విని, బ్యాలెన్స్ తప్పి పడిపోయానని ఆమె వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. చూస్తే రోమాలు నిక్కబోడుచుకోవడం ఖాయం.. జింకను ఎలా మింగేసిందో చూడండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి