ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: బాబోయ్.. అది దెయ్యం ఇల్లా.. ఏలియన్స్ స్థావరమా? అంటార్కిటికా మంచులో భారీ తలుపు.. నెటిజన్ల కామెంట్లు..

ABN, Publish Date - Oct 18 , 2024 | 09:03 AM

అమెజాన్ అడవుల్లో ఏం జరుగుతోందో.. కొండ ఎక్కడుందో, నది ఎలా ప్రవహిస్తోందో.. ఇలా మనకు కావాల్సిన మ్యాపింగ్ సమాచారాన్ని గూగుల్ మ్యాప్స్ అందిస్తుంటాయి. తాజాగా గూగుల్ మ్యాప్స్ ద్వారా ఓ సంచలన విషయం బయటపడింది. మంచుతో కప్పి ఉండే అంటార్కిటికాలో వింతైన డోర్ వే ఒకటి కనిపించింది.

Mysterious door in Antarctica

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ విషయాన్నైనా మనం ఇంట్లో కూర్చునే తెలుసుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్ (Google Maps) అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ ప్రాంతం గురించిన సమాచారం అయినా లభ్యమవుతోంది. కొండ ఎక్కడుందో, నది ఎలా ప్రవహిస్తోందో.. అమెజాన్ అడవుల్లో ఏం జరుగుతోందో.. ఇలా మనకు కావాల్సిన మ్యాపింగ్ సమాచారాన్ని గూగుల్ మ్యాప్స్ అందిస్తుంటాయి. తాజాగా గూగుల్ మ్యాప్స్ ద్వారా ఓ సంచలన విషయం బయటపడింది. మంచుతో కప్పి ఉండే అంటార్కిటికా (Antarctica)లో వింతైన డోర్ వే ఒకటి కనిపించింది. ఆ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దానిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు (Mysterious door in Antarctica).


తూర్పు అంటార్కిటికాలోని జపాన్‌కు చెందిన షోవా స్టేషన్ సమీపంలో దీన్ని గుర్తించారు. గూగుల్ మ్యాప్స్ కోఆర్డినేట్స్ ప్రకారం 69°00’50″S 39°36’22″E దగ్గర ఈ వింతైన ఆకారం కనిపించిందట. నిత్యం భారీ మంచుతో నిండే ఉండే అంటార్కిటికాలో అలాంటి వింత తలుపును చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఆ ఫొటోపై నెటిజన్లు తమకు తోచిన కామెంట్లు చేస్తున్నారు. ``అది దెయ్యం ఇంటికి సంబంధించిన గేట్``, ``అది నాజీల స్థావరమా?``, ``అక్కడ ఏలియన్స్ ఉంటున్నాయేమో`` అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మరొకరు అది బోయింగ్ విమానం డోర్ అని కామెంట్ చేస్తూ.. ఇటీవల జరిగిన విమానాన్ని ప్రమాదాన్ని గుర్తు చేశాడు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఈ విషయం గురించి భిన్నంగా చర్చించుకుంటున్నారు.


న్యూకాజిల్ విశ్వవిద్యాలయంలో గ్లేషియాలజీ ప్రొఫెసర్ అయిన బెతాన్ డేవిస్.. అదొక మంచుకొండ అని, అది భూమిపైకి చేరి ఇప్పుడు కరిగిపోతోందని చెప్పారు. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌కి చెందిన క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్‌మెంట్‌ కో-డైరెక్టర్, ప్రొఫెసర్ మార్టిన్ సీగెర్ట్ కూడా ఈ విషయంపై స్పందించారు. ఆ ప్రాంతంలో మంచు చాలా సన్నంగా ఉంటుందని, ఏదో ఒక ఘనపదార్థం చుట్టూ మంచు నిలిచిపోయి అలా కనబడుతోందని అన్నారు. ఆ ప్రాంతంలో మంచు చాలా త్వరగా కరిగిపోతోందని, బలమైన గాలులు వీచినప్పుడు మంచు కణాలు ఎగురుతున్నాయని పేర్కొన్నారు. ఏదేమైనా ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి..

Optical Illusion: మీ కళ్ల పవర్‌కు టెస్ట్.. ఈ ఫొటోలో తేడాగా ఉన్న తాళం చెవిని 11 సెకెన్లలో కనిపెట్టండి..


Viral Video: వావ్.. వాటే ట్యాలెంట్.. ఈ కుర్రాడి ట్యాలెంట్ చూస్తే ఆశ్చర్యంతో షాకవ్వాల్సిందే.. వీడియో వైరల్..


Ratan Tata: పీవీ నరసింహారావుకు రతన్ టాటా లేఖ.. ఆర్థిక సంస్కరణల గురించి ఏమన్నారంటే..


Viral Video: కిక్ ఎక్కాక.. కొండచిలువ అయినా డోంట్ కేర్.. మత్తులో ఉన్న వ్యక్తి పైకి ఎక్కిన కొండచిలువ ఏం చేసిందో చూడండి..

Optical Illusion: మీ ఐక్యూకు రియల్ టెస్ట్.. ఈ ఫొటోలో ఉన్న చిన్న తప్పును 5 సెకెన్లలో కనిపెట్టండి..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 18 , 2024 | 09:05 AM