Share News

Viral: కారులో వెళుతూ ఆ పనులేంటి మేడమ్? బరితెగించిన జంటకు పోలీసులు ఇచ్చిన సూపర్ ట్విస్ట్ ఏంటంటే..

ABN , Publish Date - Jul 17 , 2024 | 11:55 AM

అతడు నాగ్‌పూర్‌లో ఛార్టెడ్ అకౌంటెంట్.. ఆమె ప్రముఖ కంపెనీలో పని చేస్తున్న మెకానికల్ ఇంజినీర్.. వారిద్దరూ ప్రేమికులు.. ఎంతో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారిద్దరూ సభ్యతను మరిచారు.. కారులో బిజీ రోడ్డుపై వెళుతూ రొమాన్స్‌లోకి దిగారు.. రోడ్డు మీద వెళుతున్న వ్యక్తి వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు..

Viral: కారులో వెళుతూ ఆ పనులేంటి మేడమ్? బరితెగించిన జంటకు పోలీసులు ఇచ్చిన సూపర్ ట్విస్ట్ ఏంటంటే..
Police registered case against Nagpur Lovers

అతడు నాగ్‌పూర్‌లో (Nagpur) ఛార్టెడ్ అకౌంటెంట్.. ఆమె ప్రముఖ కంపెనీలో పని చేస్తున్న మెకానికల్ ఇంజినీర్.. వారిద్దరూ ప్రేమికులు (Lovers).. ఎంతో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారిద్దరూ సభ్యతను మరిచారు.. కారు (Car)లో బిజీ రోడ్డుపై వెళుతూ రొమాన్స్‌లోకి దిగారు.. రోడ్డు మీద వెళుతున్న వ్యక్తి వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. దీంతో వారిద్దరూ భారీ మూల్యం చెల్లించుకున్నారు.. పోలీసుల (Police)కు చిక్కి పరువు పోగొట్టుకున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral News).


ఆ వీడియో ప్రకారం కారు సోమవారం సాయంత్రం నాగ్‌పూ‌ర్‌లోని బిజీ రోడ్డు అయిన లా కాలేజ్ రోడ్డులో వెళుతోంది. వర్షం పడుతున్న ఆ సమయంలో ప్రియుడు కారు నడుపుతుండగా ప్రేయసి అతడి ఒడిలో కూర్చుని అతడిని గట్టిగా కౌగిలించుకుంది. ముద్దులతో ముంచెత్తింది. ప్రియురాలితో రొమాన్స్ సాగిస్తూనే ఆ యువకుడు కారును నడుపుతున్నాడు. వారి తీరును చూసిన ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో పట్టుకుని నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అత్యంత ప్రమాదకరంగా కారు నడుపుతున్న ఆ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


కారు నెంబర్ ఆధారంగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కారును సీజ్ చేశారు. బిజీ రోడ్డుపై ప్రమాదకరంగా కారు నడుపుతూ అసభ్య చేష్టలకు దిగిన ఆ ప్రేయసి ప్రియులను అరెస్ట్ చేశారు. వారిద్దరూ వయసు ప్రస్తుతం 28 సంవత్సరాలు. వారిపై భారతీయ న్యాయ సంహిత, బాంబే పోలీస్ యాక్ట్, మోటార్ వెహికల్ చట్టం ప్రకారం పలు కేసులు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: కామెడీ కాకపోతే మరేంటి..? కుట్టు మెషిన్‌ను తిప్పడం కోసం ఇంత తతంగం అవసరమా?


Viral Video: ఆహా.. ద్వాపర యుగం నాటి సీన్ రిపీట్.. ఆవుల ముందు నెమలి నాట్యం ఎలా చేసిందో చూడండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 17 , 2024 | 11:55 AM