ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: కొండపై 10అడుగుల వింత మనుషులు.. ఏలియన్స్ అని అనుమానిస్తుండగానే.. మరో షాక్..

ABN, Publish Date - Jan 12 , 2024 | 09:08 PM

ఏలియన్స్ నిజంగా ఉన్నాయో, లేవో తెలీదు గానీ.. వాటికి సంబంధించిన వార్తలు మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ఫ్లైయింగ్ సాసర్లపై భూమికి వచ్చారని, ఫలానా ప్రాంతంలో దిగారని.. వీడియోలతో సహా బయటపెడుతుంటారు. అయితే...

ఏలియన్స్ నిజంగా ఉన్నాయో, లేవో తెలీదు గానీ.. వాటికి సంబంధించిన వార్తలు మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ఫ్లైయింగ్ సాసర్లపై భూమికి వచ్చారని, ఫలానా ప్రాంతంలో దిగారని.. వీడియోలతో సహా బయటపెడుతుంటారు. అయితే గ్రహాంతర వాసులు నిజంగా ఉన్నట్లు ఇంతవరకూ ఎలాంటి ఆధారాలూ లభించలేదు. ఈ విషయం పక్కన పెడితే తాజాగా, బ్రెజిల్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ఎత్తైన కొండపై ఏకంగా 10 అడుగుల వింత మనుషులను చూసి.. మళ్లీ ఏలియన్స్ చర్చ తెరపైకి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆగ్నేయ బ్రెజిల్ (Brazil) తీరానికి మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న ఇల్హా దో మెల్ అనే ద్వీపంలో ఓ కొండపై ఇటీవల షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొందరు పర్యాటకులు కొండపై దృశ్యాలను తమ కెమెరాలో బంధిస్తుండగా.. వారికి దూరంగా కొందరు ఎత్తైన మనుషులు కనిపించారు. సుమారు 10 అడుగుల ఎత్తు ఉన్న కొందరు కొండ అంచున నిలబడ్డ వారు (10 foot men) ఏదో పరిశీలిస్తున్నట్లు కనిపించింది. వారిని చూసి షాకైన వ్యక్తి కెమెరాను జూమ్ చేసి చూశాడు. వింత మనుషులు ఏలియన్స్ (Aliens) తరహాలో కనిపంచంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

Viral Video: కింగ్ కోబ్రాతో ఆటలాడితే ఇలాగే ఉంటుంది మరి.. ఈ స్నేక్ క్యాచర్ ఏం చేశాడో చూడండి..

చూస్తుండగానే వారిలో ఓ వ్యక్తి అంత ఎత్తు ఉన్న కొండను క్షణాల్లో కిందకు దిగేశాడు. దీన్ని చూసి వీడియో చూస్తున్న వారు ఇంకా షాక్ అయ్యారు. అంత ఎత్తు కొండను దిగాలంటే చాలా సమయం పడుతుందని, అలాంటిది ఆ వింత మనిషి నిముషాల వ్యవధిలో కిందకు దిగడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని చర్చించుకున్నారు. అలాగే కొండకు దిగువ భాగంతో మరో వింత వ్యక్తి అటూ, ఇటూ తిరుగుతూ కనిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. ‘‘వామ్మో! ఇంత ఎత్తున్న మనుషులను చూడడం ఇదే తొలిసారి’’.. అంటూ కొందరు, ‘‘అంతెత్తు కొండను క్షణాల్లో దిగారంటే.. ఏలియన్సే అని అనుమానంగా ఉంది’’.. అంటూ ఇంకొందరు, ‘‘కొండల్లో ఇలా నడవడం మనుషులకైతే సాధ్యం కాదు’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2.60లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బాధపడుతున్న పిల్లాడిని గమనించిన కుక్క పిల్ల.. సమీపానికి వెళ్లి మరీ సర్‌ప్రైజ్ చేసిందిలా..

Updated Date - Jan 12 , 2024 | 09:08 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising