ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: వామ్మో! వీళ్లేంట్రా.. సోయా చాప్‌ తయారీలో.. మరీ ఇంత ఘోరంగా..

ABN, Publish Date - Feb 01 , 2024 | 07:08 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల ఫుడ్ మేకింగ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే కొన్ని ఆహార పదార్థాల తయారీ చూసేందుకే ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి వీడియోలు నిత్యం తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల ఫుడ్ మేకింగ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే కొన్ని ఆహార పదార్థాల తయారీ చూసేందుకే ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి వీడియోలు నిత్యం తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. సోయా చాప్ తయారీ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వీళ్లేంట్రా.. సోయా చాప్‌ను మరీ ఇంత ఘోరంగా చేస్తున్నారు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మాంసాహారం రుచిని అందించే సోయా చాప్ కర్రీ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే దీన్ని ఎలా తయారు చేస్తారో చాలా మందికి తెలీదు. అయితే ఇటీవల వైరల్ అవుతున్న సోయా చాప్ తయారీ (Soya Chop Preparation) వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఓ పెద్ద వంట గదిలో కొందరు పిల్లలు సోయా చాప్ తయారీలో నిమగ్నమై ఉంటారు. అయితే వారు తయారు చేసిన విధానమే ప్రస్తుతం అందరికీ విరక్తి పుట్టిస్తోంది.

Viral Video: ముంబై మెట్రోలో.. రవీనా టాండన్‌ ఊహించని సర్‌ప్రైజ్..

కొన్ని ప్లాస్టిక్ డ్రమ్ముల్లో మైదా పిండి తదితరాలను నీటిని కలిపి కాళ్లతో తొక్కుతున్నారు. ఇలా చాలా సేపటి తర్వాత ఆ పిండిని వుండలుగా చేసి, మరో పెద్ద బాణలిలో ఉడికించారు. అయితే ఈ ప్రక్రియ మొత్తంలో ఎక్కాడా వారు పరిశుభ్రత పాటించలేదు. పూర్తి అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో సోయా చాప్స్‌ను తయారు చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. కొందరు దీన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఇది మరీ ఘోరం’’.. అంటూ కొందరు, ‘‘వీటిని తిన్న వాళ్ల పని అయినట్లే’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 25వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ ఆడ సింహం ప్రేమ నటిస్తూ.. ఎలా మోసం చేసిందో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

Updated Date - Feb 01 , 2024 | 07:08 PM

Advertising
Advertising