Viral: ఇంత చిన్న దుకాణంపై అంత పెద్ద ఇల్లేంట్రా బాబోయ్.. ఈ ఇంజినీర్ తెలివి మామూలుగా లేదుగా..
ABN, Publish Date - Dec 06 , 2024 | 06:45 PM
చిత్రవిచిత్ర నిర్మాణాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. కొందరు రోడ్డుకు ఇరువైపులా స్తంభాలు వేసి, వాటిపై ఇల్లు కడితే.. ఇంకొందరు త్రిభుజాకారంలో పెద్ద ఇల్లు నిర్మించి అంతా అవాక్కయ్యేలా చేశారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలను రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా..
చిత్రవిచిత్ర నిర్మాణాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. కొందరు రోడ్డుకు ఇరువైపులా స్తంభాలు వేసి, వాటిపై ఇల్లు కడితే.. ఇంకొందరు త్రిభుజాకారంలో పెద్ద ఇల్లు నిర్మించి అంతా అవాక్కయ్యేలా చేశారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలను రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఇలాంటి ఓ విచిత్ర నిర్మాణానానికి సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. చిన్న దుకాణంపై పెద్ద ఇల్లు కట్టడాన్ని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ ఇంజినీర్ తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ ఫొటో (Viral Photo) తెగ వైరల్ అవుతోంది. దారి పక్కనే ఉన్న ఓ చిన్న దుకాణం అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. దుకాణం చూస్తే ఎలాంటి ఆశ్చర్యం కలగకపోయినా.. దానిపై నిర్మించిన ఇల్లే ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. స్థల సమస్య ఉందే లేక అందరి దృష్టినీ ఆకర్షించాలనే ఉద్దేశమో ఏమో గానీ.. ఓ వ్యక్తి తన ఇంటిని విచిత్రమైన రీతిలో నిర్మించేశాడు.
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే సీన్.. జాయింట్ వీల్ నుంచి జారిన యువతి.. చివరకు ఏం జరిగిందంటే..
రోడ్డు పక్కన ఉన్న చిన్న దుకాణంపై పెద్ద ఇంటిని నిర్మించాడు. దుకాణ భవనంపై మరింత వెడల్పుగా కాంక్రీట్‌తో స్లాబు నిర్మించారు. నేలపై ఉన్న ఇల్లు 8 అడుగుల వెడల్పు ఉండగా.. పైన నిర్మించిన ఇల్లు 20 అడుగులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా తక్కువ స్థలంలోనే పెద్ద ఇంటిని తెలివిగా నిర్మించడాన్ని చూసి అంతా అవాక్కవుతన్నారు. ఈ ఇల్లు రోడ్డు పక్కనే ఉండడంతో దారిన వెళ్లే వారంతా ఈ ఇంటిని విచిత్రంగా చూస్తున్నారు.
ఈ ఇంటి ఫొటోను ఓ వ్యక్తి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైలర్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి ఇంటిని ఎప్పుడూ చూడలేదే’’.. అంటూ కొందరు, ‘‘ఈ ఇంటిని కట్టిన ఇంజినీర్‌కు దండం పెట్టొచ్చు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Viral Video: ఖడ్గమృగంతో అంత ఈజీ కాదు.. సింహాల పరిస్థితి చివరకు ఏమైందంటే..
ఇవి కూడా చదవండి..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 06 , 2024 | 06:45 PM