ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఈ శిశువు మృత్యుంజయుడు! తల్లిదండ్రులు వంతెనపై నుంచి విసిరేస్తే..

ABN, Publish Date - Nov 02 , 2024 | 09:19 AM

పుట్టి పక్షం రోజులు కూడా కానీ ఆ బిడ్డను తల్లిదండ్రులు కాదనుకున్నారు. చిన్నారిని ఏ అనాథాశ్రయానికో ఇవ్వకుండా ఏకంగా వంతెనపై నుంచి విసిరేశారు. పుట్టడంతోనే కష్టాలపాల పడ్డ ఆ చిన్నారికి చివరకు మృత్యువును జయించాడు. తీవ్రగాయాల నుంచి కోలుకున్న అతడిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.

ఇంటర్నెట్ డెస్క్: పుట్టి పక్షం రోజులు కూడా కానీ ఆ బిడ్డను తల్లిదండ్రులు కాదనుకున్నారు. చిన్నారిని ఏ అనాథాశ్రయానికో ఇవ్వకుండా ఏకంగా వంతెనపై నుంచి విసిరేశారు. కిందున్న చెట్టులో చిక్కుని తీవ్ర గాయాలపాలైన ఆ బిడ్డ చివరకు మరణాన్ని జయించాడు. ఆసుపత్రిలో దాదాపు నెల రోజు చికిత్స అనంతరం కోలుకున్న చిన్నారిని చూసి నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఎంతో సంతోషించారు. ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది (Viral).

ఈ నెల 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు! జనవరిలో ప్రమాణస్వీకారం! ఎందుకంటే..


హమీర్‌పూర్ ప్రాంతంలో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఆ బిడ్డ చెట్టునుంచి వేళాడుతూ స్థానికులకు కనిపించాడు. ఒంటినిండా గాయాలతో ఉన్న అతడిని చూసి వారు దడుసుకున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అంతెత్తునుంచి పడటంతో చిన్నారికి చాలా గాయాలయ్యాయి. దీనికి తోడు కాకులు, ఇతర పక్షులు మరో జంతువేదో కరవడంతో వీపునకు పెద్ద గాయమే అయ్యింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చివరకు చిన్నారిని కాన్పూర్‌లోని లాలా లజ్‌పత్ రాయ్ ఆసుపత్రికి పంపించారు. చిన్నారిని చూడగానే వైద్యులు షాకైపోయారు. బతకడనే అనుకున్నారు. దైవంపై భారం వేసి చికిత్స ప్రారంభించారు. శ్రీకృష్ణజన్మాష్టమి రోజున లభించిన బిడ్డ కాబట్టి కృష్ణి పేరు పెట్టారు.

Viral: ఆండ్రాయిడ్ కంటే ఐఫోన్‌లో అధికంగా ధరలు! ఫ్లిప్‌కార్ట్‌పై గుస్సా!


ఆసుపత్రిలో ఉన్నన్నీ రోజులు చిన్నారిని నర్సులు కంటికిరెప్పలా కాపాడుకున్నారు. ఒంటినిండా గాయాలైన చిన్నారిని కనీసం ఎత్తుకునే వీలు కూడా ఉండేది కాదు. నొప్పి భరించలేక చిన్నారి ఏడిస్తే దూరం నుండి నిలబడే నర్సులు లాలి పాటలు పాడేవారు. గాయాలపై నోటితో గాలి ఊది ఉపశమనం కలిగించే ప్రయత్నం చేసేవారు. అలా వారు పడిన రెండు నెలల కష్టం ఎట్టకేలకు పలించింది. బాలుడు క్రమంగా కోలుకోవడంతో ఆసుపత్రి వర్గాలు చిన్నారిని అక్టోబర్ 24న చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించాయి.

Indian Railways: అపరిశుభ్ర టాయిలెట్.. రైల్వేకు వినియోగదారుల కోర్టు షాక్!


‘‘చిన్నారి ఆసుపత్రిని వీడుతుంటే మేము కన్నీరు ఆపుకోలేకపోయాము. ఇన్నాళ్లు మా సొంతబిడ్డలా చూసుకున్న చిన్నారిని వెళుతుంటే తట్టుకోవడం మా వల్ల కాలేదు. ఆ చిన్నారిని తల్లిదండ్రులు ఎలా వంతెనపై నుంచి విసిరేయగలిగారో. కనీసం ఏ గుడి ముందో వదిలిపెట్టి ఉన్నా చిన్నారికి ఇన్ని బాధలు తప్పి ఉండేవి కదా’’ అని ఆసుపత్రి వైద్యులు ఒకరు చెప్పారు.

Read Latest and Viral News

Updated Date - Nov 02 , 2024 | 09:19 AM