Viral: భార్యపై ప్రేమ.. రోజూ 320 కిలోమీటర్ల ప్రయాణిస్తున్న కొత్త పెళ్లికొడుకు!
ABN, Publish Date - Jul 20 , 2024 | 09:22 PM
భార్యపై ప్రేమతో తాను ప్రతి రోజూ 320 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్నాంటూ ఓ చైనా వ్యక్తి పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. భార్యపై అతడికున్న ప్రేమ చూసి జనాలు ఫిదా అయిపోతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భార్యపై ప్రేమతో తాను ప్రతి రోజూ 320 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్నాంటూ ఓ చైనా వ్యక్తి పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. భార్యపై అతడికున్న ప్రేమ చూసి జనాలు ఫిదా అయిపోతున్నారు. చైనాలో ఈ ఉదంతం సంచలనంగా (Viral) మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే, మిస్టర్ లిన్, అతడి భార్య షాండాండ్ ప్రావిన్స్‌లోని వీఫాంగ్ ప్రాంతంలో నివసిస్తుంటాడు. వారికి ఇటీవలే పెళ్లి అయ్యింది. అక్కడ అతడికి సొంత ఫ్లాట్ ఉంది. భార్యాభర్తలిద్దరూ దాన్ని కలిసి కొనుక్కున్నారు.ఇక భార్య కోరిక మేరకు అతడు ఆ ప్రాంతంలో ఇంటి కొనుగోలుకు అంగీకరించాడు. ఇక అతడి ఆఫీసు 160 కిలోమీటర్ల దూరంలోని కింగ్డావ్ ప్రాంతంలో ఉంది. ప్రతి రోజు ఆఫీసుకు వెళ్లి వచ్చే క్రమంలో అతడు ఏకంగా 320 కిలోమీటర్ల ప్రయాణిస్తుంటాడు (Newly Married Chinese Man Says He Travels 320 Km Daily For Love Of Wife ).
Viral: ఆడ గొరిల్లాల మధ్య పంచాయితీ, మగ గొరిల్లా ఎలా సెటిల్ చేసిందో చూస్తే..
ఉదయం 5.20 గంటలకే ఇంట్లోంచి బయలుదేరే అతడు 30 నిమిషాల పాటు ఎలక్ట్రిక్ బైక్‌పై ప్రయాణించి 6.15 గంటలకు రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడి నుంచి రైల్లో బయలుదేరి 7.46 గంటలకు కింగ్డావ్‌కు వెళతాడు. ఆ తరువాత మరో సబ్‌వే ట్రైన్‌లో ప్రయాణించి ఆఫీసుకు చేరుకుంటాడు. ఆ తరువాత ఆఫీసులోనే అల్పాహారం తిని 9.00 గంటలకు ఆఫీసు పని మొదలెడతాడు. సాయంత్రం పని ముగించుకుని మరో మూడు నాలుగు గంటల ప్రయాణం తరువాత ఇంటికి చేరుకుంటాడు.
లిన్ చెప్పిందంతా విని జనాలు షాకైపోయారు. ఆఫీసుకు దగ్గరా ఇల్లు తీసుకోవచ్చుగా అని ప్రశ్నించారు. కానీ, తన భార్యకు ఇష్టమైన ప్రాంతంలో తాము ఇల్లు కొనుగోలు చేసినట్టు తెలిపాడు. ఆమె అక్కడే భద్రంగా ఫీలవుతుందని అన్నాడు. ప్రజారవాణా వ్యవస్థలు అందుబాటులో ఉన్న కారణంగా ఇంత దూరం జర్నీ కూడా సులువుగానే ఉందని చెప్పుకొచ్చాడు. అయితే, తన భార్య కింగ్డావ్ ప్రాంతంలో జాబ్ కోసం ప్రయత్నిస్తోందని, అన్ని అనుకున్నట్టు జరిగితే అక్కడకు మారిపోతామని చెప్పాడు. దీంతో, భార్య సంతోషం కోసం లిన్ కష్టపడుతున్న తీరు చూసి జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Updated Date - Jul 20 , 2024 | 09:22 PM