Viral Video: కళ్ల ముందే మాయమైన రోడ్డు.. వీడియో చూస్తే అవాక్కవడం ఖాయం.. యూపీలో ఏం జరిగిందంటే..
ABN, Publish Date - Jul 08 , 2024 | 01:59 PM
ప్రస్తుతం వర్షాకాలం కావడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరభారతం వర్షాలతో తడిసి ముద్దవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ దెబ్బకు రోడ్లు పాడైపోయి భారీ గుంతలు ఏర్పడుతున్నాయి.
ప్రస్తుతం వర్షాకాలం కావడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు (Rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరభారతం వర్షాలతో తడిసి ముద్దవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని పలు జిల్లాల్లో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ దెబ్బకు రోడ్లు (Roads) పాడైపోయి భారీ గుంతలు ఏర్పడుతున్నాయి. అయితే ముజఫర్‌నగర్ జిల్లాలో ఇటీవలే వేసిన ఓ రోడ్డు కళ్ల ముందే కొట్టుకుపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
యూపీలోని ముజఫర్‌నగర్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ చోట ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి ధాటికి రోడ్డు రెప్ప పాటులో రెండుగా చీలిపోయి నీరు ప్రవహించడం కనిపిస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో కొందరు వాహనదారులు రోడ్డుపై తమ వాహనాలను నిలిపి ఉంచారు. ఓ వ్యక్తి రోడ్డుపై దృష్టి పెట్టి వీడియో తీస్తున్నాడు. అంతలో ఉన్నట్టుండి రోడ్డు మధ్య భారీ గుంత ఏర్పడింది. దాని కింద నుంచి నీళ్లు వేగంగా ప్రవహిస్తున్నాయి. కొద్దిసేపటికే నీటి ప్రవాహం పెరిగిపోయి రోడ్డు రెండుగా చీలిపోయింది.
ఈ వీడియోను జర్నలిస్ట్ సచిన్ గుప్తా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొత్తగా వేసిన రోడ్డు ఆ స్థాయిలో కూలిపోవడంపై చాలా మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ``అవినీతి ఏ స్థాయిలో ఉందో చూశారా``, ``కొద్దిపాటి వర్షాలకే యూపీ, బీహార్‌లలో చాలా బ్రిడ్జిలు కూలిపోయాయి``, ``యూపీలో బ్రిటీష్ వారి కాలంలో వేసిన బ్రిడ్జ్‌లే ఇంకా పటిష్టంగా ఉన్నాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Puzzle: మీ బ్రెయిన్‌కు టెస్ట్.. ఈ రెండు ఫొటోల్లోని మూడు తేడాలను 10 సెకెన్లలో కనిపెట్టండి!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 08 , 2024 | 01:59 PM