ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: జూ కీపర్‌పై సింహం దాడి.. ఎలా చేసిందంటే..

ABN, Publish Date - Oct 01 , 2024 | 06:51 PM

ఒక్కొక్కసారి చిన్నపాటి నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు తెస్తుంది. అందుకే ఏ మాత్రం అజాగ్రత్త పనికి రాదని పెద్దలు తరచూ హెచ్చరిస్తూ ఉంటారు. సింహానికి ఆహారం పెట్టే క్రమంలో సేఫ్టీ గేట్‌ను మూసివేయడం మరిచి పోయాడీ జూ సంరక్షకుడు. అంతే అతడిపై సింహం ఒక్కసారిగా దాడి చేసి చంపేసింది.

ఒక్కొక్కసారి చిన్నపాటి నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు తెస్తుంది. అందుకే ఏ మాత్రం అజాగ్రత్త పనికి రాదని పెద్దలు తరచూ హెచ్చరిస్తూ ఉంటారు. సింహానికి ఆహారం పెట్టే క్రమంలో సేఫ్టీ గేట్‌ను మూసివేయడం మరిచి పోయాడీ జూ సంరక్షకుడు. అంతే అతడిపై సింహం ఒక్కసారిగా దాడి చేసి చంపేసింది. ఈ ఘటన నైజీరియాలో శనివారం చోటు చేసుకుంది.


ఇంతకీ ఏం జరిగిందంటే.. నైజీరియాలోని అబెకుటలో ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఒలుసెగున్ ఒబాసంజోకు చెందిన ప్రెసిడెన్షియల్ లైబ్రరీ వైల్డ్ లైఫ్ పార్క్‌లో బాబాజీ దౌలే జూ సంరక్షకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం అతడు యధా విధిగా విధుల్లోకి హాజరయ్యారు. ఆ క్రమంలో సేఫ్టీ గేట్‌ను తెరిచి ఉంచి.. జూలో జంతువులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నాడు. గేటు తీసి ఉంచిన విషయాన్ని బాబాజీ దౌలే దాదాపుగా మరచి పోయాడు. అంతలో సింహం దాడి చేసి అతడి మెడను గట్టిగా పట్టుకుంది. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు.


సింహం దాడితో అతడి మెడపై తీవ్ర గాయాలు కావడంతో బాబాజీ దౌలే వెంటనే మరణించాడని పోలీసులు వెల్లడించారు. సింహాలను అదుపు చేయడంలో బాబాజీ దౌలే శిక్షణ తీసుకున్నాడని తెలిపారు. అయితే జూలో జంతువులకు ఆహారం అందించే సమయంలో సింహాలు, పులులున్న బోనులకు తలుపులు, తాళాలు వేసి ఉన్నాయో లేదో ముందుగానే నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. కానీ నిర్లక్ష్యం కారణంగా సింహం తప్పించుకుని అతడిపై దాడికి తెగబడిందన్నారు. దీంతో అతడు మృత్యువుకు చేరువయ్యాడని తెలిపారు.


ఇక ఈ ఘటనపై జూ మేనేజ్‌మెంట్ స్పందించింది. బాబాజీ దౌలే మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. జూ ఉద్యోగులు, సందర్శకులతోపాటు జంతువుల సంరక్షణకు తాము తొలి ప్రాధాన్యం ఇస్తామని మేనేజ్‌మెంట్ ఈ సందర్బంగా స్పష్టం చేసింది.


మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరిలో నైజిరీయాలోని ఒబాఫెమి అవలోవో యూనివర్సిటీ వద్ద ఈ తరహా ఘటన చోటు చేసుకుంది. సింహానికి ఆహారం అందించే క్రమంలో జూ సంరక్షుడిపై దాడి చేసింది. ఈ దాడిలో జంతు సంరక్షకుడిని రక్షించేందుకు అతడి స్నేహితులు రంగంలోకి దిగారు. ఆ క్రమంల అతడిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు సైతం చేశారు. కానీ అతడు మాత్రం ఈ దాడిలో మృతి చెందాడు. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స తన కథనంలో వివరించింది.

మరిన్ని ప్రత్యేకమైన వార్తలు మరియు తెలుగు వార్తల కోసం...

Updated Date - Oct 01 , 2024 | 06:51 PM