Home » Nigeria
ఒక్కొక్కసారి చిన్నపాటి నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు తెస్తుంది. అందుకే ఏ మాత్రం అజాగ్రత్త పనికి రాదని పెద్దలు తరచూ హెచ్చరిస్తూ ఉంటారు. సింహానికి ఆహారం పెట్టే క్రమంలో సేఫ్టీ గేట్ను మూసివేయడం మరిచి పోయాడీ జూ సంరక్షకుడు. అంతే అతడిపై సింహం ఒక్కసారిగా దాడి చేసి చంపేసింది.
పశువులు, ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కును వేగంగా వచ్చిన ఇంధన ట్యాంకర్ ఢీ కొట్టింది. దీంతో పేలుడు సంభవించి దాదాపు 48 మంది మరణించగా, మరో 50 పశువులు మృతి చెందాయి. ఈ దారుణ ఘటన నైజీరియా(Nigeria)లో ఆదివారం చోటుచేసుకుంది.
తీగ లాగితే డొంక కదిలినట్లు హైదరాబాద్లో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు అయ్యింది. ఓ రేవ్ పార్టీ కేసును విచారిస్తున్న సమయంలో బెంగుళూరు నుంచి నగరానికి మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న ముఠా గురించి తెలిసినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి వెల్లడించారు. అనంతరం దాడులు నిర్వహించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు.
పారిస్లో ఒలింపిక్స్ వేడుకలు గతానికి బిన్నంగా జరిగాయి. నాలుగు గంటల పాటు జరిగిన విశ్వక్రీడల ప్రారంభ వేడుకలు వీక్షకులను అలరించాయి. ప్రపంచ దేశాల నుంచి హాజరైన క్రీడాకారులు ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు.
150 మందికిపైగా విద్యార్థులు ఉన్న ఓ పాఠశాల భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలింది(school building collapse). ఈ ఘటనలో 22 మంది విద్యార్థులు దుర్మరణం చెందగా, మరో 100 మందికిపైగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన ఆఫ్రికా దేశమైన నైజీరియా(Nigeria)లో చోటుచేసుకుంది.
ఆఫ్రికా ఖండమైన ఈశాన్య నైజీరియా(Nigeria)లోని బోర్నో రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. పలు చోట్ల చోటుచేసుకున్న బాంబు పేలుళ్లలో(Bomb blasts) 18 మంది మృత్యువాత చెందగా, మరో 48 మంది గాయపడ్డారు.