Shocking: కిచెన్ లేదు, బాత్రూమ్ లేదు.. న్యూయార్క్‌లో ఈ చిన్న రూమ్ రెంట్ ఎంతో తెలిస్తే షాక్!
ABN , Publish Date - Feb 26 , 2024 | 06:08 PM
ముంబైలో కేవలం 300 చదరపు అడుగులలో నిర్మించిన ఫ్లాట్‌కు లక్షకు పైగానే అద్దె చెల్లిస్తున్న పరిస్థితి గురించి ఇటీవల సోషల్ మీడియాలో భారీ చర్చ జరిగింది. మన దేశంలోని నగరాలే కాదు.. అమెరికాలోని న్యూయార్క్ నగరం పరిస్థితి అంత కంటే పై స్థాయిలో ఉంది.

మనదేశంలోని ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి మెట్రో పాలిటన్ నగరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ (Cost of Living) తారస్థాయిలో ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇంటి అద్దెలు (Rents) కళ్లు చెదిరే రీతిలో ఉంటాయి. ముంబైలో కేవలం 300 చదరపు అడుగులలో నిర్మించిన ఫ్లాట్‌కు (Mumbai Flat) లక్షకు పైగానే అద్దె చెల్లిస్తున్న పరిస్థితి గురించి ఇటీవల సోషల్ మీడియాలో భారీ చర్చ జరిగింది. మన దేశంలోని నగరాలే కాదు.. అమెరికాలోని న్యూయార్క్ నగరం పరిస్థితి అంత కంటే పై స్థాయిలో ఉంది. న్యూయార్క్ (New York) నగరంలోని అతి చిన్న ఫ్లాట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
న్యూయార్క్‌లోని ఒమర్ లాబాక్ అనే రియల్టర్ ఆ అతిచిన్న ఫ్లాట్‌కు సంబంధించిన వీడియో రూపొందించాడు. ఆ వ్యక్తి ఓ తలుపు తీసి లోపలికి ప్రవేశించాడు. లోపల పొడవుగా ఓ గది మాత్రమే ఉంది. ఓ మూలన కబోర్డ్ ఉంది. బాత్రూమ్ లేదు, కిచెన్ లేదు. అయినా దానిని అపార్ట్‌మెంట్‌గా అభివర్ణిస్తున్నారు. ఇంతకీ ఆ చిన్న గది అద్దె ఎంతో తెలుసా? 1200 డాలర్లు. మన భారత కరెన్సీలో రూ.99,459. అంటే సుమారు లక్ష రూపాయలన్నమాట (New York Room Rent).
realtoromer అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియో మిలియన్‌కు పైగా వ్యూస్ దక్కించుకుంది. 1.29 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ``ముందు దానిని అపార్ట్‌మెంట్ అనడం ఆపండి``, ``ఆ గదిలో ఎలా బతకాలి``, ``ఇది చట్టపరంగా సరైనది కాదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు