Viral Video: ఈ బైక్ ఎలా నడుస్తోందబ్బా.. పెట్రోల్ లేదు, పెడల్ లేదు.. గాలిలో దూసుకుపోతున్న బైక్..
ABN , Publish Date - Nov 06 , 2024 | 09:30 AM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏదో ఒకటి చేసి పాపులారిటీ సంపాదించాలనుకునే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కొందరు నిజాయితీగా, సమర్థవంతంగా ఏదో ఒక ప్రయోగం లేదా ఆవిష్కరణ చేసి గుర్తింపు తెచ్చుకుంటుంటే.. మరికొందరు కేవలం వ్యూస్, లైక్స్ కోసం వింత వింత పనులు చేస్తున్నారు.
సోషల్ మీడియా (Social Media) అందుబాటులోకి వచ్చాక ఏదో ఒకటి చేసి పాపులారిటీ సంపాదించాలనుకునే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కొందరు నిజాయితీగా, సమర్థవంతంగా ఏదో ఒక ప్రయోగం లేదా ఆవిష్కరణ చేసి గుర్తింపు తెచ్చుకుంటుంటే.. మరికొందరు కేవలం వ్యూస్, లైక్స్ కోసం వింత వింత పనులు చేస్తున్నారు. అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియో చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు (Viral Video).
vasu_n_patel అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి రోడ్డు మీద వేగంగా ఓ విచిత్రమైన బైక్ (Bike)పై జర్నీ చేస్తున్నాడు. అయితే ఆ బైక్‌కు పెట్రోల్ ట్యాంక్ లేదు అలాగే పెడల్ కూడా లేదు. అయినా ఆ వ్యక్తి వేగంగా బైక్ మీద వెళ్లిపోతున్నాడు. అదే రోడ్డు మీద ప్రయాణిస్తున్న మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి.. ``ఆ బైక్ దేనితో నడుస్తోంది`` అని ప్రశ్నించాడు. పెట్రోల్ అవసరం లేకుండా, పెడల్ లేకుండా ఆ బైక్ ఎలా వెళ్తోందో తెలియక చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 5 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 50 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అది రీల్స్ కోసం చేశారు. ఎవరో వెనుక నుంచి గట్టిగా తోశారు``, ``రాయల్ ఇన్విజిబుల్``, ``ఇది వాయుపుత్ర బైక్``, ``అతడికి ఎలన్ మస్క్ నుంచి 99 మిస్డ్ కాల్స్ వచ్చాయి`` అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఈమె ఒక వర్గానికి ఇన్స్పిరేషన్.. వర్షంలో నిల్చుని ఏం చేస్తోందో చూడండి.. నవ్వాపుకోలేరు..
Viral Video: అందరికీ ఇలాంటి టీచర్ ఉండాలి.. క్లాస్‌రూమ్‌లో పిల్లలకు ఎలా పాఠం చెబుతున్నారో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..