ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: దీపావళి అంటే ఇదీ.. అబ్బుర పరుస్తున్న డ్రోన్ ఫుటేజీ!

ABN, Publish Date - Oct 31 , 2024 | 11:12 AM

నోయిడాలో రాత్రివేళ దీపావళి వెలుగులను డ్రోన్ ద్వారా చిత్రీకరించారు. ఈ వీడియో నెట్టింట వైర‌గా మారింది. ఇది అద్భుతం అంటూ జనాలు ముక్తకంఠంతో కొనియాడుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: యావత్ దేశం దీపావళి పండుగను ఉత్సాహంగా జరుపుకుంటోంది. అయితే, ఈ వెలుగుల పండగ గొప్పదనమంతా సూర్యాస్తమయం తరువాత ఆశిష్కృతమవుతుందన్న విషయం తెలిసిందే. లక్షలాది ఇళ్లల్లో దివ్వెల వెలుగులు రాత్రి వేళ ఓ కొత్త రంగుల ప్రపంచాన్నే సృష్టిస్తాయి. మరి ఇదే దృశ్యాన్ని ఆకాశం నుంచి చూస్తే నక్షత్రాలన్నీ భూమ్మీదకొచ్చినట్టు అనిపించాల్సిందే. డ్రోన్ టెక్నాలజీ పుణ్యమా అని ఇలాంటి దృశ్యాలు ఇప్పుడు దేశమంతా చూసి అబ్బుర పడుతోంది (Viral).


Diwali 2024: దీపావళి అలంకరణ.. ఈ టిప్స్‌తో ఇంట్లో వెలుగులు రెట్టింపు


దీపకాంతుల్లో రాత్రి వేళ వెలిగిపోతున్న నోయిడా ప్రాంతాన్ని కొందరు డ్రోన్ వీడియో తీసి నెట్టింట పంచుకున్నారు. రకరకాల విద్యుత్ దీపాల అలంకరణలతో వెలిగిపోతున్న భవనాల అద్భుత సౌందర్యాన్ని చిత్రీకరించారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. నాయిడాగ్రామ్ అనే ఇన్‌స్టా అకౌంట్‌లో ఈ వీడియోను షేర్ చేశారు.

Diwali Special: టపాసులు కొంటున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు ఈజీగా మోసపోతారు

ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నోయడా వాసులు మాత్రం ఈ వీడియోలో తమ సొసైటీ ఎక్కడ ఉందో అని వెతుక్కునే పనిలో పడ్డారు. ఆకాశం నుంచి చూస్తే దీపావళి వేడుక ఇంత అద్భుతంగా ఉంటుందా అని కొందరు అన్నారు. నేనుండే సొసైటీ కనిపించిందోచ్ అని ఓ వ్యక్తి సంబరపడ్డారు. ఇన్ని వెలుగుల కోసం ఎంత విద్యుత్ ఖర్చవుతోందో ఏంటో అని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. కటెంట్ అద్భుతంగా ఉందని కూడా కితాబిచ్చారు.

Diwali 2024: దీపావళికి టపాసులు కాల్చుతారా.. ఈ టిప్స్‌ మీ కోసమే


ఇదిలా ఉంటే.. నోయిడాకు పొరుగున్న ఉన్న ఢిల్లీ మాత్రం వాయుకాలుష్యంతో సతమతమవుతోంది. దీపావళి రోజున ఉదయం ఆనంద్ విహార్ ప్రాంతంలో వాయుకాలుష్యం బాగా పెరిగినట్టు ఏక్యూఐ ఇండెక్స్ తేల్చింది. పీఎం 10 అనే సూక్ష్మ ధూళికణాల సంఖ్య పెరగడంతో ఏక్యూఐ 419కి చేరింది. 24 గంటల వ్యవధికి సంబంధించిన సగటు ఏక్యూఐ ఇండెక్స్‌ మంగళవారం 280కి చేరింది. ఇదిలా ఉంటే, గురు శుక్రవారాల్లో వాయుకాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ సంస్థ నిపుణులు హెచ్చరించారు.

గత ఎనిమిదేళ్లల్లో ఎన్నడూ చూడని విధంగా గతేడాది ఢిల్లీలో దీపావళి సందర్భంగా వాయుకాలుష్యం తగ్గింది. అయితే, ఈసారి మాత్రం వాయు కాలుష్యం పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

Read Latest and Viral News

Updated Date - Oct 31 , 2024 | 11:22 AM