కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: వామ్మో! ఇంతకీ ఇతను మనిషేనా.. దుప్పటి పైకి తీయగా.. లోపలి నుంచి ఏమొచ్చాయో చూడండి..

ABN, Publish Date - Jan 11 , 2024 | 04:03 PM

ఆకలి రుచి ఎరుగదు.. నిద్ర సుఖమెరుగదు.. అన్న సామెతకు నిదర్శనంగా అప్పుడప్పుడూ మన కళ్ల ముందు ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తీవ్రమైన ఆకలి వేసినప్పుడు రుచితో సంబంధం లేకుండా ఏదోటి తినాలని అనుకుంటాం. అలాగే..

Viral Video: వామ్మో! ఇంతకీ ఇతను మనిషేనా.. దుప్పటి పైకి తీయగా.. లోపలి నుంచి ఏమొచ్చాయో చూడండి..

ఆకలి రుచి ఎరుగదు.. నిద్ర సుఖమెరుగదు.. అన్న సామెతకు నిదర్శనంగా అప్పుడప్పుడూ మన కళ్ల ముందు ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తీవ్రమైన ఆకలి వేసినప్పుడు రుచితో సంబంధం లేకుండా ఏదోటి తినాలని అనుకుంటాం. అలాగే అతిగా నిద్ర వచ్చే సమయంలో స్థలంతో సంబంధం లేకుండా వెంటనే నిద్రపోవాలి అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం మరీ విచిత్రంగా ఉన్నట్టున్నాడు. ఇతడు పడుకున్న తీరు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఎంత నిద్ర వస్తే మాత్రం.. మరీ ఇలా పడుకోవడమేంట్రా నాయనా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. న్యూయార్క్ (New York) నగరంలోని ఓ సబ్‌వే స్టేషన్‌‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ బాటసారి సబ్‌వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌పై దుప్పటి కప్పుకొని పడుకుని ఉంటాడు. అయితే అతన్ని చూడగానే కొంత మందికి అనుమానం వచ్చింది. దీంతో విషయం ఏంటో తెలుసుకోవాలని వీడియో తీసుకుంటూ అతడి వద్దకు వెళ్లారు. దగ్గరికి వెళ్లి పిలవగా పడుకున్న వ్యక్తి ఒక్కసారిగా దుప్పటి పైకి తీశాడు.

Viral Video: పారాగ్లైడర్‌కు ఊహించని షాక్.. నేల పైకి క్షేమంగా దిగాడు కానీ.. తీరా చూస్తే...

దుప్పటి ఇలా తీశాడో లేదో.. అంతే, లోపలి నుంచి పదుల సంఖ్యలో ఎలుకలు (Rats) పరుగులు పెట్టుకుంటూ బయటికి వచ్చాయి. అప్పటిదాకా ఆ వ్యక్తి ఎలుకలతో కలిసి నిద్రపోవడాన్ని చూసి అంతా షాక్ అయ్యారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అలా.. ఎలా నిద్రపోయావ్ రా నాయానా’’.. అంటూ కొందరు, ‘‘ఎలుకలలను పెంచుకుంటున్నాడేమో..’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మధ్యప్రదేశ్ కారును చూసి మల్లారెడ్డిని గుర్తు చేసుకుంటున్న నెటిజన్లు.. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

Updated Date - Jan 11 , 2024 | 04:03 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising