Viral: ఎయిర్‌పోర్టులోనూ ఇదే దుస్థితా! రూ.200 పెట్టి పకోడీలు కొంటే..
ABN, Publish Date - Dec 11 , 2024 | 04:45 PM
ఖరీదైన రెస్టారెంట్లు మొదటు వీధుల్లో దొరికే ఫుడ్స్ వరకూ ఎక్కడ చూసినా నాణ్యతాలోనం సర్వసాధారణమైపోయిందని వినియోగదారులు గగ్గొలు పెడుతున్నారు. తాజాగా విమానశ్రయంలో కూడా ఇలాంటి ఘటన వెలుగు చూడటంతో బాధిత ప్రయాణికుడు లబోదిబోమంటూ తన గోడు నెట్టింట వెళ్లబోసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: బయట కొంటున్న ఆహారాల్లో నాణ్యతా లోపానికి సంబంధించిన ఘటనలు తరచూ వెలుగులోకి వస్తాయి. ఖరీదైన రెస్టారెంట్లు మొదటు వీధుల్లో దొరికే ఫుడ్స్ వరకూ ఎక్కడ చూసినా నాణ్యతాలోనం సర్వసాధారణమైపోయిందని వినియోగదారులు గగ్గొలు పెడుతున్నారు. తాజాగా విమానశ్రయంలో కూడా ఇలాంటి ఘటన వెలుగు చూడటంతో బాధిత ప్రయాణికుడు లబోదిబోమంటూ తన గోడు నెట్టింట వెళ్లబోసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఉదంతం సంచలనంగా మారింది (Viral).
Viral: అద్భుతం.. ఏనుగులను రైలు ఢీకొనకుండా కాపాడిన ఏఐ కెమెరా!
డీపీ గుర్జార్ అనే ప్రయాణికుడు ఇటీవల ఎయిర్‌పోర్టు కెఫేలో తనకు ఎదురైన అనుభవాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. తాను ఇటీవల జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని ఓ కెఫీలో రూ.200 పెట్టి పకోడీ ఆర్డరిచ్చినట్టు వెల్లడించాడు. అయితే, రెండు ముక్కలు తినగానే తనకు వాంతి వస్తున్నదన్న భావన మొదలైందని పేర్కొన్నాడు. రుచిలో కూడా మార్పు గుర్తించినట్టు వెల్లడించారు. ఈ విషయాలను అక్కడి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా వాళ్లు పట్టించుకోలేదని పేర్కొన్నాడు. ఆ తరువాత పకోడీలో చచ్చిన బొద్దింకను చూడగానే తనకు జుగుప్స కలిగిందని చెప్పాడు. ఈ విషయమై ఎయిర్‌పోర్టు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోదారి లేక తను చివరకు పకోడీల వీడియోను రికార్డు చేసి నెట్టింట పంచుకున్నట్టు పేర్కొన్నాడు.
Viral: ఊబెర్ డ్రైవర్ ఆదాయం చూసి పేటీఎం ఫౌండర్ ఆశ్చర్యం!
కాగా, ఈ ఉదంతం వైరల్ కావడంతో జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టుల్లోనూ ఆహారనాణ్యతా లోపాలా అంటూ కొందరు మండిపడ్డారు. తరచూ ఇలాంటి ఫిర్యాదులు నెట్టింట చూస్తున్నామని కొందరు వాపోయారు. ఇప్పటికే ఎయిర్‌పోర్టుల్లో ఆహారానికి అధిక ధరలు చెల్లిస్తూ జేబులు గుల్లచేసుకుంటుంటే ఇక ఆరోగ్యానికి నష్టం కలుగుతోందా అని ఓ వ్యక్తి అన్నాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం వైరల్‌గా మారింది. జనాల్లో ఆగ్రాహావేశాలు రేకెత్తిస్తోంది.
Elon Musk: నేను అప్పుడే చెప్పా.. కానీ నాకు మతి లేదని అన్నారు: ఎలాన్ మస్క్
Updated Date - Dec 11 , 2024 | 04:45 PM