Viral: అమెరికా వీధుల్లో పానీ పురి స్టాల్.. జనాల రెస్పాన్స్ చూస్తే..
ABN , Publish Date - Jun 10 , 2024 | 10:08 PM
తొలిసారిగా పానీపురి రుచి చూసిన మినియాపొలిస్ వాసులు తెగ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: పానీపురీ అంటే ఇష్టపడని భారతీయుడంటూ ఉండరు. ముఖ్యంగా చిన్నతనంలో స్కూల్ అయిపోయాక బయటకొచ్చి కచ్చితంగా పానీ పురీ తినాల్సిందే. అయితే, విదేశాల్లో సెటిలైన అనేక మంది భారతీయులు అక్కడి వారికి మన సంప్రదాయ వంటకాల రుచులను పరిచయం చేస్తున్నారు. తాజాగా అమెరికాలోని మినియాపొలిస్‌లో అదే జరిగింది. అక్కడున్న ఓ భారతీయ రెస్టారెంట్ స్థానికులకు పానీపురీని పరిచయం చేసింది. తొలిసారి దీన్ని రుచి చూసిన పాశ్చాత్యుల రియాక్షన్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా (Viral) మారాయి.
Viral: అయ్యో.. ‘వందేభారత్’లో కూడా ఇదే సీన్! షాకింగ్ వీడియో
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, రెస్టారెంట్ నిర్వాహకులు బయట ఓ చిన్న స్టాండ్ ఏర్పాటు చేసి పానీపురీని టేస్ట్ చేయాలంటూ వచ్చే పోయే వారికి ఆఫర్ చేశారు. అనేక మంది దీన్ని రుచి చూసి ఆశ్చర్యపోయారు. ఉప్పు, కారం, మసాలా సమపాళ్లల్లో ఉన్న ఈ ఫుడ్ యమా టేస్టీగా ఉందంటూ అనేక మంది కామెంట్ చేశారు. దీన్ని మరోసారి టేస్ట్ చేసేందుకు ఈ రెస్టారెంట్‌కు కచ్చితంగా వస్తామని కొందరు అన్నారు (Pani Puri takes Minneapolis by storm Americans amazed).
ఇక వీడియోపై నెట్టింట కూడా భారీ రెస్పాన్స్ వస్తోంది. పానీపురీ నచ్చని వారు ప్రపంచంలోనే ఉండరని కొందరు కామెంట్ చేశారు. మరికొందరు మాత్రం తమకు వీసా వస్తే అమెరికాలో పానీ పురి బండి పెట్టుకుంటామని సరదాగా పేర్కొన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.